Thursday, January 9, 2025

హసన్‌పర్తి నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వేలైన్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఖాజీపేట(హసన్‌పర్తి) నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వేలేన్ నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డిపిఆర్)ను తెప్పించి తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రిని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కలిశారు.హసన్‌పర్తి నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వేలేన్ ను నిర్మించాలని సంజయ్ కోరారు. ఈ నెల 8న వరంగల్ లో ఖాజీపేట వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, పీవోహెచ్ కు సంబంధించి భూమి పూజ చేస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అశ్వినీ వైష్ణవ్ బండి సంజయ్‌తో చర్చించారు.

కరీంనగర్‌కు కొత్త రైల్వే లేన్ నిర్మాణానికి సంబంధించి సత్వర చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బండి సంజయ్ కోరారు. సానుకూలంగా స్పందించిన అశ్వీనీ వైష్ణవ్ వెంటనే ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డిపిఆర్)ను తెప్పించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరే శ్రీరాం, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News