- Advertisement -
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు(ఆహార భద్రత కార్డులు) కావాల్సిన వారు మీ సేవా కేంద్రాలలో ధరఖాస్తులు చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారు తమ రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, అక్షర దోషాలు వంటి వాటిని సరిచేసుకునే సదుపాయాన్ని కూడా పొందవచ్చని పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన పేదలు ఎప్పుడైనా మీ సేవా కేంద్రాల ద్వారా తమవద్ద ఉన్న పత్రాలతో ధరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
- Advertisement -