Tuesday, April 1, 2025

మార్చి 1న లక్ష రేషన్‌కార్డులు

- Advertisement -
- Advertisement -

 ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్
జిల్లాల్లో పంపిణీ కోడ్ కారణంగా ఈ మూడు
జిల్లాలకే పరిమితం మార్చి 8తరువాత మిగతా
జిల్లాల్లో పంపిణీ మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ లక్ష కొత్త రేషన్ కార్డులను ఒకే రోజున పంపిణీ చేయనుంది. సంక్రాంతి, జనవరి 26 అంటూ రేషన్ కార్డుల పంపిణీని వాయిదా వేస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు ముహూర్తం నిర్ణయించింది. మార్చి 1న కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వక సంవత్సరాలు గడుస్తుండడంతో తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయగా మార్చి 1న ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో హైదరాబాద్ జిల్లాల్లో పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. రాష్ట్రంలో 2014 నుంచి కొత్త కార్డులు జారీ చేయలేదు. ఈ క్రమంలో లబ్ధిదారుల సంఖ్య చాలా పెరిగింది.

ఈ పది సంవత్సరాల్లో పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చిన కోడళ్లు, కొత్తగా జన్మించిన పిల్లలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది వరకే ప్రజాపాలన, గ్రామ సభల్లో అఫ్లికేషన్లు పెట్టుకో, ఇటీవల మీ సేవ కేంద్రాల ద్వారా కూడా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి 1 న మూడు జిల్లాల పరిధిలో దాదాపు లక్ష మందికి పైగా కొత్తగా రేషన్‌కార్డులు ఇవ్వనున్నారు. కొత్త జిల్లాల ప్రకారంగా వికారాబాద్ జిల్లాలో ఇరవై రెండు వేలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 15 వేలు, వనపర్తి జిల్లాలో 6 వేలు, నారాయణపేట జిల్లాలో 12 వేలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 13 వేలు, గద్వాల జిల్లాలో 13 వేలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6 వేలు, రంగారెడ్డి జిల్లాలో 24 వేలు, హైదరాబాద్ నగరంలో 285 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

మూడు జిల్లాల్లో కొత్త కార్డుల పంపిణీ : రాష్ట్రంలోని ఉమ్మడి ఏడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రస్తుతానికి మూడు జిల్లాల్లో కొత్త కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 8 తరువాత మిగతా జిల్లాల్లోనూ కొత్త కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని అధికారులు తెలిపారు. మార్చి 1న మూడు జిల్లాల పరిధిలో దాదాపు 1.12 లక్షల మందికి కొత్తగా రేషన్‌కార్డులు ఇవ్వనున్నారు. కొత్త జిల్లాల ప్రకారంగా వికారాబాద్ జిల్లాలో 22 వేలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 15 వేలు, వనపర్తి జిల్లాలో 6 వేలు, నారాయణపేట జిల్లాలో 12 వేలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 13 వేలు, గద్వాల జిల్లాలో 13 వేలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6 వేలు, రంగారెడ్డి జిల్లాలో 24 వేల మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశార.ు హైదరాబాద్ నగరంలో కేవలం 285 మందినే గుర్తించారు. నగరంలో ఇంకా 83 వేల కుటుంబాలను పరిశీలించాల్సి ఉందని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.

ఈ జిల్లాల్లో మాత్రం మార్చి 8 తర్వాత : రాష్ట్రంలోని ఉమ్మడి ఏడు(మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ) జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో, ప్రస్తుతానికి ఈ మూడు(హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ) జిల్లాల్లో కొత్త కార్డుల పంపిణీకి సర్కార్ సిద్ధమైంది. మార్చి 8 తరవాత మిగతా జిల్లాల్లోనూ కొత్త కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

గృహిణి పేరుమీద రేషన్ కార్డులు : కొత్త రేషన్ కార్డుపై ప్రభుత్వ లోగోతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు ఉండే అవకాశం ఉంది. రేషన్ షాపు నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, అడ్రస్ తదితర సమాచారంతోపాటు, ఆధునిక సాంకేతికతగా బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ పొందుపరిచే యోచనలో ఉన్నారు. రేషన్ షాపుల్లో బార్ కోడ్ స్కానింగ్, బయోమెట్రిక్ విధానం ద్వారా నిత్యావసర సరఫరా సౌలభ్యం కల్పించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ విధానం అమలులోకి వస్తే పారదర్శకత పెరిగి, అనర్హులకు రేషన్ సరఫరా నివారించేందుకు వీలవుతుంది. ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను మహిళల పేరుమీద అందజేస్తోంది. రేషన్ కార్డులను కూడా గృహిణి పేరుమీద జారీ చేయాలని నిర్ణయించింది. ఈ చర్య ద్వారా కుటుంబాలకు సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News