Sunday, November 3, 2024

కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయ్

- Advertisement -
- Advertisement -

ఆదేశాలు జారీ చేసిన సిఎం రేవంత్
28నుంచి దరఖాస్తుల స్వీకారం

మనతెలంగాణ/హైదరాబాద్ :తెలంగాణ ప్రజలకు కాం గ్రెస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నూతన సంవత్సరం కానుకగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన ప్రక్రియకు ఆదేశా లు జారీ చేశారు. ఎన్నో ఎళ్లుగా ఎదురు చూస్తున్న లక్షలాది నిరుపేద కుంటుంబాలకు ఆహారభద్రత కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కార్డు లేని కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డు పొందేందుకు ఈ నెల 28 నుంచి ధరఖాస్తులు స్వీకరించనున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డుల్లో సవరణలకు కూడా ప్రభుత్వంఆదేశాలిచ్చింది.కుటుంబంలో కొత్తగా చేరిన సభ్యులను రేషన్‌కార్డుల్లో సభ్యులుగా పేర్లు చేర్చటం, మరణించిన వారిపేర్లు తొలగించటం , ఉన్న చోటు నుంచి రాష్ట్రం పరిధిలోనే మరో జిల్లాకు ,మరో గ్రామానికి,వలస వెళ్లిన వారికి చిరునామాలు మార్పు చేయటం , ఒకే గ్రామంలో ఒక రేషన్ డీలర్ పరిధి నుంచి మరో రేషన్ డీలర్ పరిధిలోకి వార్డుల మార్పిడి అయిన వారికి ఇంటి అడ్రస్‌మార్పులు తదితర వాటికి కూడా దరఖాస్తులు స్వీకరించిరేషన్‌కార్డుల్లో సవరణలు చేసి అందించనున్నారు.
తీరనున్న రేషన్ కష్టాలు:
ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల మంజూరుతో నిరుపేద కు టుంబాల కష్టాలు తీరనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గత అరేళ్లకుపైగా రా ష్ట్రంలో కొత్తరేషన్ కార్డులు మంజూరు చేయలేదు. రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన ప్రకియ మొదలు పెట్టినప్పటికీ వివిధ కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియకు సంబంధించి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డల కోసం సుమారు10లక్షల మంది ధరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తులన్ని పెండింగ్‌లోనే ఉండిపోయాయి. రా ష్ట్రంలో ప్రభుత్వాలు మారిపోయాయి.గత బిఆర్‌ఎస్ ప్రభు త్వం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావంటంతో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ధరఖాస్తులపై ఆశలు చిగురించాయి. రేషన్ కార్డులు లేకపోవటంలో చాలమంది ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వ పధకాల ప్రయోజనం పొందలేకపోయారు. రెండు పడకల ఇల్లకు కూడా రేషన్‌కార్డు లింకు పెట్టడంతో కార్టులు లేని వారికి ఈ పథకం అందకుండా పోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు లింకు వల్ల ఏళ్ల తరబడి పేదలు సంక్షమపథకాలు పొందలేకపోయారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల మంజూరుకు చర్యలు చేపట్టడంతో పేదకుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News