Friday, February 21, 2025

ఎటిఎం సైజులో కొత్త రేషన్ కార్డు?

- Advertisement -
- Advertisement -

కార్డుల పంపిణీపై వేగం పెంచిన ప్రభుత్వం
పలు డిజైన్‌లను సిఎంకు చూపించిన అధికారులు
ఈ కార్డుల కోసం షార్ట్ టెండర్లను
పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధం

రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులపై వేగం పెంచింది. అందులో భాగంగా కొత్త రేషన్ కార్డులు ఎలా ఉండాలి, డిజైన్లు, రేషన్ కార్డులపై ఫ్యామిలీ ఫొటోలు ఉండాలా? వద్దా అనే వాటిపై సిఎం రేవంత్ రెడ్డితో అధికారులు చర్చిస్తున్నారు. ఒకవేళ కుటుంబసభ్యుల ఫొటోలు లేకపోయినా కుటుంబ సభ్యుల పేర్లు మొత్తం ఇందులో ఉంటాయని అధికారులు పేర్కొంటు న్నారు. కార్డు వెనుకవైపు అడ్రస్, రేషన్ షాపు నెంబర్, ఇతర వివరాలు కూడా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు, కేరళ లాంటి తదితర రాష్ట్రాల్లో రేషన్ కార్డు తరహాలో ప్రభుత్వం ఇక్కడ రేషన్‌కార్డు తీసుకురాబోతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే పాత కార్డుల్లా కాకుండా స్మార్ట్ కార్డు రూపంలో ఏటిఎం కార్డు సైజులో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది.

ఈ మేరకు కార్డుల డిజైన్‌ను అధికారులు రెడీ చేస్తున్నారు. ఒకవైపు సిఎం ఫొటో, మరోవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటో, మధ్యలో ప్రభుత్వ లోగో ఉంటుందని అధికారికవర్గాల సమాచారం. ఇప్పటికే పలు రేషన్ కార్డు డిజైన్లను అధికారులు సిఎంకు చూపించారు. అయితే, ముందుగా లక్ష కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వీటి కోసం షార్ట్ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజాపాలన, గ్రామసభలు, మీసేవ, కులగణనలో దరఖాస్తులు చేసుకున్న అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా కోడ్ లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సిఎం ఆదేశించిన నేపథ్యంలోనే అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News