మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: రాను న్న ఏడు రోజుల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం నేలకొండపల్లి మండలం, కట్టుకాచారంలో పర్యటించి రూ.3 కోట్లతో చేపట్టిన రాయగూడెంతక్కెళ్లపాడు వయా క ట్టుకాచారం రహదారి వరకు చేపట్టిన రో డ్డు అభివృద్ధి, పటిష్టపరిచే పనులకు శంకుస్థాపన చేశారు. పభుత్వం మంజూరు చేసి న వివిధ రోడ్డు నిర్మాణ పనులను 10 రో జులలో ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత సెప్టెంబర్‌లో రికా ర్డు స్థాయిలో కురిసిన వర్షాల కారణంగా రై తులు తీవ్రంగా నష్టపోయారని, రోడ్లు దె బ్బతిన్నాయని,తాత్కాలికరోడ్లమరమ్మ తు, విద్యుత్ లైన్‌ల పునరుద్ధరణ, ఇండ్లలోకి నీరు వచ్చిన కుటుంబాలకు పరిహారం, ఇసుక మేటలు వచ్చిన పొలాలకు సైతం నష్టపరిహారం అందించామని అన్నారు. పాలేరు నియోజకవర్గం పరిధిలో రూ.950 కోట్ల పైగా రోడ్డు పనులు మంజూరు చేశామని అన్నారు.
జంక్షన్ నుంచి కట్టుకాచారం వరకు రూ.3 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులకు టెండర్లు పూర్తి చేశామని, రాబోయే 10 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కట్టుకాచారం నుంచి బుట్లగుంట వాగు వరకు రూ.2.5 కోట్లతో రోడ్డు పనులు మంజూరు చేశామని అన్నారు. కట్టుకాచారం నుంచి తక్కెలపాడుకు రూ.2 కోట్లు, గ్రామంలో అంతర్గత సిసి రోడ్లకు రూ.41.5 లక్షలు మంజూరు చేశామని, రోడ్డు నిర్వహణకు రూ.కోటి 68 లక్షలు, గ్రామం మొత్తం మీద రూ.6 కోట్ల 61 లక్షల పనులు మంజూరు చేశామని, వీటిని 10 నుంచి 15 రోజుల వ్యవధిలో ప్రారంభిస్తామని అన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తి కాగానే బస్సు మంజూరు చేస్తామని అన్నారు. శ్రీరామనవమి తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్‌ఇ యుగంధర్, ఆర్‌డిఓ నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, నేలకొండపల్లి తహసీల్దార్ మానిక్ రావు, ఎంపిడివో ఎర్రయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.