Wednesday, January 22, 2025

త్వరలో కొత్త రేషన్ కార్డులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అ ర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ అందజేస్తామని నీటిపారుదల, పౌరసరఫరా ల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హా మీఇచ్చారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చే స్తామని ఆయన భరోసా ఇచ్చారు. అ కాలవర్షం కారణంగా తడిసిన ధా న్యా న్ని కూడా కొనుగోలు చేస్తామని రై తు లు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆ యన చెప్పారు. తాము 11 మందిమి క లిసి క్రికెట్ టీమ్ మాదిరిగా కలిసిగట్టు గా పనిచేస్తున్నామని అన్నారు. శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణత్యా గం చేశారని, శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్‌లో చేరారన్నారు. శంకరమ్మ కాంగ్రెస్ పార్టీ ఇం ఛార్జీ దీపాదా స్ మున్షీ, మంత్రి ఉత్తమ్ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. కె సి వేణుగోపాల్ ఆదేశాల మేరకు ఆమె నుపార్టీ లో చేర్చుకున్నామన్నారు. శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ శంకరమ్మ గతం లో తన మీ దనే పోటీ చేశారని, కానీ, ఎ ప్పుడూ ప రస్పర గౌరవంతో ఉన్నామన్నారు. ః

పా ర్టీలో బిసిలకు, వెనుకబడిన తరగతుల కు ప్రాధాన్యత ఇస్తామన్నారు. బిజె పి, బిఆర్‌ఎస్ అబద్ధాల ప్ర చారం తో గె లవాలని చూస్తుందన్నారు. పదేళ్లు తెలంగాణకు ఏమీ చేయని మో డీ, అమిత్ షాలు మత విద్వేషాలతో వి భజించాల ని చూస్తున్నారన్నారు. మోడీ దిగజారి మట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది బిజెపి అజెండా అని ఆయన మండిపడ్డారు. జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ మోడీపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవం..అబద్ధం.. ఆధాని..అంబానీ మోడీ వెంటనే ఉన్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారు, మోడీ, అమిత్ షాలు ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అదానీ, అంబానీలు రాహుల్ గాంధీ తో దోస్తీ చేస్తే ఈడీ, సిబిఐతో విచారణ జరిపించాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు.

ఈ ఎన్నికల్లో 13 సీట్లు గెలుచుకుంటాం
డిప్యూటీ సిఎం భట్టి నాయకత్వంలో విద్యుత్ సరఫరా సక్రమంగా జరుగుతుందన్నారు. గతంలో కంటే మెరుగ్గా సరఫరా ఉందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 13 సీట్లు గెలుచుకుంటామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. మూడు స్థానాల్లో బిజెపి ప్రభావం ఉంటుందని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఎంఐఎం ఒక స్థానం గెలుస్తుందని, ఇక బిఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాము రైతు బంధు వేయకపోతే వేయలేదు అంటున్నారు. రైతు బంధు వేస్తే ఆపండి ఆపండి అని ప్రతిపక్ష నాయకులు ఆపిస్తున్నారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. కెసిఆర్ ఏదైనా మాట్లాడతారని మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిఆర్‌ఎస్ పార్టీలో ఎలాంటి న్యాయం జరగలేదు: శంకరమ్మ
బిఆర్‌ఎస్ పార్టీలో తనకు ఎలాంటి న్యాయం జరగలేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నానని ఆమె ప్రకటించారు. రాష్ట్రంలో మెజార్టీ లోక్‌సభ స్థానాలు గెలవడం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. శంకరమ్మ తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News