Saturday, January 18, 2025

సంక్రాంతి తరువాత స్మార్ట్ రేషన్ కార్డులు

- Advertisement -
- Advertisement -

10లక్షల మందికి లబ్ధి ఈ
సమావేశాల్లోనే ఆర్‌ఒఆర్ బిల్లు
పంచాయతీరాజ్ సహా పలు
సవరణ బిల్లులకు కేబినెట్
ఆమోదం ఈకార్ రేసు నిధుల
గోల్‌మాల్‌పై సుదీర్ఘ చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ కమి టీ హాల్‌లో సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సు మారు మూడు నుంచి నాలుగు గంటల పా టు కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్టు గా సమాచారం.పలు ఆర్డినెన్స్‌లకు కేబినెట్ ఆ మోదం తెలిపినట్టుగా తెలిసింది. ఓఆర్‌ఆర్ పరిధిలోని 51 గ్రామ పంచాయితీలను సమీ ప మున్సిపాలిటీల్లో విలీనం చేసే కీలక ఆర్డినెన్స్‌తో పాటు పంచాయతీరాజ్ చట్టానికి, స్పో ర్ట్ యూనివర్సిటీ, సిబ్బంది జీతాలు, పింఛ ను చెల్లింపులు, అనర్హతల (సవరణ) బిల్లు, మ హానగర పాలక సంస్థ (సవరణ) బిల్లు, తెలంగాణ వస్తువులు, సేవల పన్ను (సవరణ) బి ల్లు,తెలంగాణ పురపాలక సంఘాల(సవరణ) బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా సమాచారం.దీంతోపాటుఈ కార్ రేసులో జరిగిన అవినీతిపై చాలాసేపు కేబినెట్‌లో చర్చించినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఈనెల 28వ తేదీన భూమి లేని వారికి రూ.6 వేలు ఇవ్వాలని, సంక్రాంతి తరువాత కొత్త రేషన్‌కార్డులను జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ కార్ రేసులో నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదించడంతో, గవర్నర్ ఇచ్చిన అనుమతిని సిఎస్ ద్వారా ఏసిబికి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.

ఇకపై ముగ్గురు పిల్లలున్నా పోటీ చేసేలా….
పంచాయతీరాజ్ చట్టం- 2018 సవరణ బిల్లులో గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలోని కీలక అంశాలను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు విడతల రిజర్వేషన్ పద్ధతిని తొలగించి పాత విధానంలో ఒకే విడతకు రిజర్వేషన్ కొనసాగించను న్నట్టుగా తెలిసింది. ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీ చేసేందుకు అందులో అవకాశం కల్పించనున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం కనీసం ముగ్గురు ఎంపిటిసిలు ఉన్న మండలాల్లో ఎంపిపిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ క్లాజ్‌ను మార్చి ప్రతి మండలానికి కచ్చితంగా ఐదుగురు ఎంపిటిసిలు, ఆపై ఉండేలా సవరణ చేసినట్టుగా సమాచారం. దీంతో ప్రస్తుతం ఎంపిటిసి స్థానాలు ఐదు కంటే తక్కువ ఉన్న రాష్ట్రంలోని 22 మండలాల్లో ఎంపిటిసిల సంఖ్య పెరుగనుంది. ఈ సవరణతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎంపిటిసి స్థానాలు 5,817 ఉండగా, మరో 50కిపైగా పెరగనున్నాయి.

కొత్తగా 10 లక్షల రేషన్‌కార్డులు
కొత్తగా 10 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులను ఇవ్వనున్న నేపథ్యంలో 31లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు కొత్తగా 18 లక్షల కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 91.68 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News