Saturday, November 2, 2024

రికార్డుస్థాయిలో రూ.150కోట్ల ఆదాయం

- Advertisement -
- Advertisement -

New registration charges will come into effect from February 1

భూముల పాత విలువల
చివరిరోజు రిజిస్ట్రేషన్ల శాఖకు
అసాధారణ ఆదాయం
కిటకిటలాడిన సబ్
కార్యాలయాలు దాకా
కొనసాగిన రిజిస్ట్రేషన్లు నేటి
నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు
సవరణకు మార్గదర్శకాలు
విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరింపు కోసం ప్ర భుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రివిజన్ ఆఫ్ మార్కెట్ వాల్యూస్ గైడ్‌లైన్స్ అండ్ రూల్స్ 1998 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన మార్కెట్ విలువలు నేటి నుంచి (మంగళవారం) అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ రుసుము కట్టిన వారికి కొత్త ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. పాత విలువలతోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింపునకు వెసులుబాటు కల్పించారు. నేటి నుంచి 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి. సెక్షన్ 5 ప్రకారం స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ కమిషనర్, డైరెక్టర్ జనరల్ తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News