Saturday, October 5, 2024

నెలాఖరుకు కొత్త రెవెన్యూ చట్టం

- Advertisement -
- Advertisement -

సుదీర్ఘ కసరత్తు తర్వాతే ఆర్‌ఓఆర్ చట్టం సిద్ధం

దసరా నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ: మంత్రి పొంగులేటి

మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో:  ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు విజయదశమి కా నుకగా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర రెవె న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఆయన శుక్రవారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొం డా సురేఖలతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ధరణి దరఖాస్తులు, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు, ఫ్యామిలీ డిజిటల్ సర్వే తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. డబుల్ ఇండ్ల పంపిణీకి సంబంధించి లబ్ధిదారులుగా ఉండాలన్నదే ప్రభు త్వం వారం రోజుల్లో మార్గదర్శకాలు చే స్తుందని, విద్యుత్, శానిటేషన్, నీటి సౌక ర్యం, మౌలిక సదుపాయాలు ఉన్న ఫలం గా అందుబాటులోకి తేవాలని, ఇందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు.

వివిధ దశలలో ఉన్న మిగతా ఇండ్ల నిర్మాణాలను రాబోయే రో జుల్లో పూర్తి చేయాలన్నారు. అలాగే ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 నుంచి 4 వేల ఇండ్లు మంజూరు చేయనున్నామని ఆయన అన్నారు. అలాగే గత ప్రభుత్వం ధరణి పేరుతో లక్షలాది మం ది ప్రాణాలతో చెలగాటమాడిందని, రైతుల్లోనూ అభద్రతా భావానికి గురయ్యారని అందుకే ధరణి బాధల నుంచి విముక్తి కలిగించే కొత్త చట్టానికి తమ ప్రభుత్వం సమగ్ర, నూతన ఆర్‌ఓఆర్ చట్టాన్ని రూపొందించిందని ఆయన వెల్లడించారు. ఈనెలాఖరుల్లోపు కొత్త ఆర్‌ఓఆర్ చట్టం అమల్లోకి తెస్తామని, యావత్తు దేశానికే ఈ కొత్త చట్టం ఆదర్శంగా నిలువబోతుందన్నారు.

రెవెన్యూ చట్టంలో మార్పులు చేయాలనుకునే వారికి కొత్త ఆర్‌ఓఆర్ యాక్టు ఎంతో ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనేక మంది నిపుణులను, మేధావులను, సామాజిక నేతలను సంప్రదించి సుదీర్ఘ కసరత్తులు చేసిన తర్వాతే ఆర్‌ఓఆర్ చట్టాన్ని సిద్ద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వాలనే సంకల్పంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డును జారీ చేయడానికి ముందుగానే పైలట్ సర్వే నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీ సేవలతో పాటు విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాల ఫ్యామిలీ డిజిటల్ కార్డునే ప్రామాణికంగా పరిగణిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News