ఈరోజు నుండి డిసెంబర్ నెల ప్రారంభమైంది. నెల మొదటి తేదీ నుండి అనేక ఆర్థిక నియమాలు మారనున్నాయి. ఇది కాకుండా.. అనేక వస్తువుల ధరలు కూడా మారాయి. ఇవి సామాన్య ప్రజలకు షాక్ ఇవ్వొచ్చు. ఈ పెద్ద మార్పుల ప్రభావం సామాన్య ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. డిసెంబర్ 1, 2024 (ఆదివారం) నుండి ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఇప్పుడు చూద్దాం.
గ్యాస్ సిలిండర్
ఈరోజు గ్యాస్ సిలిండర్ తాజా ధరలు విడుదల అయ్యాయి. వీటి ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్ల పై ఆధారపడి ఉంటాయి. కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. వాటి ధరలు దాదాపు రూ.16.5 పెరిగాయి. అయితే, డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
క్రెడిట్ కార్డ్ రూల్స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ నిబంధనలు మారాయి. కొత్త నియమం ప్రకారం.. ఇప్పుడు డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా వ్యాపారులతో లావాదేవీలపై ఎలాంటి రివార్డ్ పాయింట్లు అందుబాటులో ఉండవు. కాగా, నవంబర్ వరకు ఈ లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి.
ఓటీపీ రూల్స్
కొత్త నిబంధనల ప్రకారం.. టెలికాం కంపెనీలు ఓటీపీ సంబంధిత ట్రేసబిలిటీ నిబంధనలను అమలు చేశాయి. ఈ నియమం మోసం, ఫిషింగ్ నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా.. ఇప్పుడు అన్ని సందేశాలను టెలికాం కంపెనీలు ట్రేస్ చేస్తాయి.