Sunday, December 22, 2024

ఐపిఎల్‌లో కొత్త రూల్స్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఈసారి ఐపిఎల్‌లో పలు కొత్త నిబంధనలను ప్రవేశ పెట్టనున్నారు. చెన్నైబెంగళూరు జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. టి20 క్రికెట్‌లో ఇప్పటి వరకు ఓ ఓవర్‌లో ఒకే బౌన్సర్ వేసే అవకాశం ఉండేది. అయితే తాజాగా ఐపిఎల్‌లో ఈ నిబంధనను మార్చనున్నారు. ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసే అవకాశం బౌలర్‌కు కల్పించనున్నారు. ఉత్కంఠభరితంగా సాగే ఐపిఎల్ టోర్నీకి ఈ నిబంధన ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. దీంతో పాటు స్మార్ట్ రీప్లే సిస్టమ్‌ను కూడా ఐపిఎల్‌లో ఉపయోగించనున్నారు. అంపైర్ నిర్ణయాలపై మరింత స్పష్టత కోసం ఈ నిబంధనను ప్రవేశ పెడుతున్నారు. దీని ప్రకారం టివి అంపైర్, హాక్ ఐ ఆపరేటర్ల నుంచి వచ్చే ఫీడ్‌ను నేరుగా అందుకుంటాడు. దీని వల్ల ఎక్కువ దృశ్యాలను విభిన్న కోణాల్లో చూసే అవకాశం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News