Saturday, November 23, 2024

వాహనాల రిజిస్ట్రేషన్‌లో ఏప్రిల్ నుంచి కొత్త నిబంధనలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఈ ఏప్రిల్ నుంచి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా దేశంలో ఎంపిక చేసిన నగరాల్లో (భారత్ స్టేజ్) బిఎస్ -6 ఉద్గార ప్రమాణాలను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏప్రిల్ 1నుంచి బిఎస్- 6 వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని రెండేళ్ల క్రితమే కేంద్రం ప్రకటించింది. ఇకపై వాహన తయారీ కంపెనీలు ఆ ప్రమాణాలతోనే ఇంజన్లను తయారు చేయాల్సి ఉంటుంది. బిఎస్ 4 వాహనాల వినియోగంతో పెద్ద ఎత్తున కార్బన్‌డై ఆక్సైడ్ వెలువడుతుంది. అది వాతావరణలో కలిసిపోవడంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. దీంతో కర్భన ఉద్గారాలను తగ్గించేందుకు 2000 సంవత్సరం నుంచి భారత్ స్టేజ్ ఉద్గార ప్రమాణాలను కేంద్రం ప్రవేశపెట్టింది. 2020లో బిఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్ గ్రేటర్ పరిధిలో పూర్తిగా నిలిపివేశారు. కేవలం బిఎస్-6 ప్రమాణాలతో తయారు చేసిన వాహనాలను మాత్రమే అనుమతించారు. ఈ నిబంధనలను ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణే, సూరత్, కాన్పూర్, షోలాపూర్, జంషెడ్ పూర్, ఆగ్రా నగరాల్లో అమలు చేస్తున్నారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసే వాహనాల్లో ఎక్కువశాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రిజిస్ట్రేషన్‌లు జరుగుతాయి. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వెలువడగానే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు.
వాహన కాలుష్యం తగ్గించే దిశగా బిఎస్-6
భారత్ స్టాండర్డ్‌కు సంక్షిప్త రూపమే బిఎస్ అంటారు. వాహనం నుంచి వెలువడే వాయు ఉద్గారాలను బట్టి ఈ స్థాయిని నిర్ణయిస్తారు. 2005లో మార్కెట్‌లోకి వచ్చిన బిఎస్-3 వాహనాలు 2010 నాటికి బాగా విస్తరించాయి. 2017లో బిఎస్-4 వాహనాలు వచ్చాయి. వాహన కాలుష్యం తగ్గించే దిశగా ప్రస్తుతం బిఎస్-6 వాహనాలను మాత్రమే రోడ్లపై తిప్పాలని కేంద్ర, రాష్ట్రాలు నిర్ణయించాయి..
మైలేజీ 15 శాతం అధికం
రెండేళ్లుగా పలు షోరూంల్లో బిఎస్-6 వాహనాల విక్రయాలు ఊపందుకున్నాయి. బిఎస్ 6 వాహనాల వేగం, సామర్థ్యం మెరుగ్గా ఉండడంతో పాటు అవి కాలుష్యాన్ని తగ్గిస్తాయి. తయారీదారులు సరికొత్త ఫీచర్లు, భద్రత ప్రమాణాలతో ఈ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. ఈ వాహనాలు మైలేజీ పరంగా 15 శాతం అధికంగా వస్తాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News