నాంపల్లి : ప్రభుత్వ మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలోకి కొత్తగా వచ్చి సర్కార్ సనత్‌నగర్ ఐటీఐ వచ్చి చేరింది. ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన సుమారు ఎకర విస్తీర్ణం స్థలంలో కోటి రూపాయల ఖర్చుతో ఆధునిక అన్ని హంగుల వసతులతో సౌకర్యంగా రూపుదిద్దుకున్న ఐటీఐ భవనం సాంకేతిక విద్యార్థులకు త్వరలో అందుబాటులోకి రానున్నది. లక్షం మేరకు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్దమవుతోంది. ఇదివరలో సనత్‌నగర్ ప్రాంతంలో ఉన్న ఈ ఐటీఐని కొత్తగా ఐటీఐ మల్లేపల్లి ఆవరణ విశాల స్థలంలోకి మార్చారు. ఐటీఐలో మొత్తం 9 సాంకేతిక కోర్సులకు షెడ్లు, 15 యూనిట్లతో పనులు పూర్తయ్యాయి.
విద్యార్థులకు సకల వసతులతో సాంకేతిక అంశాల్లో శిక్షణకు అన్ని విధాలా అనువుగా ఉండేలా నిర్మాణ పనులు చేపట్టారు. పలు షెడ్లు పనులు చేపట్టారు. మద్యలో వెంటిలేటర్ కోసం ఖాళీ స్థలాలను వదిలారు. ప్రతి షెడ్డులో విద్యార్థులకు సాంకేతిక అంశాల్లో శిక్షణ ఇస్తారు. ప్రిన్స్‌పల్ ఛాంబర్, పాలన విధులు నిర్వహించేందుకు ఆఫీస్ గది, విద్యార్థులకు ప్రత్యేక వాష్‌రూంలను నిర్మించారు. నూతన భవనాలు, ప్రహరీ గోడలకు సున్నాలు వేశారు. విద్యార్థుల నీటి దాహార్తిని, అవసరాల నిమిత్తం భవనంపై పలు వాటర్ ట్యాంకులు ఏర్పాటుచేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో పెద్ద నీటిని నిల్వ ఉంచేందుకు పెద్ద సంపు కట్టారు. తాగు నీటి నల్ల భిగించారు.
జాతీయ ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేకంగా జెండా నిర్మించారు. పనిలో పనిగా యంత్రాలు, ఫర్నిచర్లు ఇతర సామగ్రిలను ఒక్కొక్కటికి తీసుకొస్తున్నారు. ఐటీఐ రక్షణ కోసం చుట్టూ ప్రహరీ గోడ కట్టారు. ఈ మేరకు విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ ఎంపిక ప్రక్రియ సాగుతోంది.
త్వరలో తేదీల ఖరారు చేసి ప్రారంభిస్తాం : ఐటీఐ ప్రిన్స్‌పాల్ బూసిరెడ్డి వెంకటరెడ్డి
సకల ఆధునిక హంగులతో విద్యార్థులు, సిబ్బందికి సౌకర్యార్దంగా ఐటీఐ నూతన భవన నిర్మాణ పనులు పూర్తయింది. సనత్‌నగర్ నుంచి ఐటీఐ తరలింపు ప్రక్రియ సాగుతోంది. త్వరలో తేదీలను ఉన్నత వర్గాలు ఖరారుచేసి ప్రారంభిస్తాం. ఐటీఐలో తొలిసారిగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం విద్యార్థుల ఆడ్మిషన్ల ప్రక్రియను ఇక్కడే జరుగుతాయి.