- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023లో మహిళల కోసం ప్రత్యేకంగా కొత్త పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మహిళా సమ్మాన్ బచత్ పాత్ర పథకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనే కొత్త పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది.
2025 వరకు రెండేళ్లపాటు ఈ పొదుపు పథకం అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో డిపాజిట్ చేసే మొత్తానికి స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2లక్షల వరకు మహిళలు, బాలికల పేరిట ఈ పథకంలో డిపాజిట్ చేయడానికి కాలావధిలో పాక్షిక మినహాయింపులకు అవకాశం ఉంటుంది.
- Advertisement -