న్యూఢిల్లీ : దేశీయ ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ పెన్షనర్ల కోసం పెన్షన్‌సేవా ప్లాట్‌ఫామ్‌ను పునరుద్ధరించింది. ఈ వెబ్‌సైట్‌ను పెన్షనర్లు, పెన్షన్ సంబంధిత సమాచారం కోసం రూపొందించారు. దీంతో పదవీ విరమణ పొందిన వారికి ఇంటి వద్ద నుంచే పెన్షన్‌కు సంబంధించిన సేవలను సులభతరం చేశారు. ఈ విషయాన్ని ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఒక ట్వీట్‌లో పేర్కొంది. పెన్షనర్లందరికీ శుభవార్త, పెన్షన్ సంబంధిత సేవలన్నింటినీ సులభంగా ప్రాసెస్ చేయడానికి పెన్షన్ సేవా వెబ్‌సైట్‌ను పునరుద్ధరించామని బ్యాంక్ ట్వీట్ చేసింది.
ఎస్‌బిఐ పెన్షన్ సర్వీస్ సేవలు
ఎస్‌బిఐ పెన్షన్ సేవా పోర్టల్ ద్వారా పెన్షన్ స్లిప్/ఫారం 16ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
సీనియర్ సిటిజన్లు వారి పెన్షన్ లావాదేవీల వివరాలను పొందవచ్చు
బకాయిల లెక్కింపు షీట్‌ను డౌన్‌లోడ్ చేసుసుకునే అవకాశముంది
ఆన్‌లైన్‌లో పెట్టుబడి సమాచారం తెలుసుకోవచ్చు
కస్టమర్లు వారి లైఫ్ సర్టిఫికెట్ పురోగతిని తనిఖీ చేయవచ్చు
పెన్షన్ ప్రొఫైల్ వివరాలను కూడా పెన్షనర్లు చూడవచ్చు
పునరుద్ధరణ తర్వాత పెంచిన సేవలివే
రిజిస్టర్డ్ మొబైల్‌పై పెన్షనర్లు ఇప్పటి నుంచి ఎస్‌ఎంఎస్ ద్వారా పెన్షన్ చెల్లింపు వివరాలను అందుకుంటారు
ఎస్‌బిఐ ఇప్పటి నుంచి జీవన్ ప్రామాణ్ సౌకర్యం అన్ని బ్యాంక్ బ్రాంచ్‌లలో అందివ్వనుంది.
పెన్షన్ స్లిప్‌ను ఇమెయిల్ లేదా పెన్షన్ చెల్లింపు శాఖ ద్వారా సేకరించవచ్చు
ఏ బ్యాంక్ బ్రాంచ్‌లోనైనా పెన్షనర్లు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించే సౌకర్యం ఉంటుంది
గ్రీవెన్స్ సేవలు
లాగింగ్‌లో ఏదైనా అసౌకర్యం కల్గితే పెన్షనర్లు ఎర్రర్ స్క్రీన్‌షాట్‌తో support.pensionseva @sbi.co.inకు ఇమెయిల్ చేయవచ్చు. లేదా ‘UNHAPPY’ అని టైప్ చేసి 8008202020 అనే నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాలి.