Thursday, January 23, 2025

మైనారిటీ మహిళలకు కొత్త పథకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోని మైనారిటీ మహిళల కోసం మైనారిటీ ఫై నాన్స్ కార్పొరేషన్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. “కెసిఆర్ కా తోఫా ఖవాతీన్ కే లియే భరోసా” అనే సరికొత్త పథకాన్ని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మ ద్ ఇంతియాజ్ ఇషాక్ ప్రారంభించారు. మంగళవారం నాంపల్లి హజ్ హౌస్‌లోని మైనారిటీ ఫైనాన్స్ కార్యాలయంలో చైర్మన్ ఇంతియాజ్ ఇ షాఖ్, ఎండి ఎ. కాంతి వెస్లి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారులతో సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నిరుద్యోగ మ హిళల కోసం ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద మైనారిటీ నిరుద్యోగ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు.

దీని వల్ల ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు లబ్ది చేకూరనుందని తెలిపారు. ఈ పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్‌ను జిల్లా మైనారిటీ అధికారులకు తెలియజేయడం జరిగిందని చైర్మన్ తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 200 కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 2000 కుట్టు మిషన్లను క్రిస్టియన్ మైనారిటీల కోసం రిజర్వు చేసినట్లు చైర్మన్/ ఇంతియాజ్ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా నుండి ఎంపిక చేసిన కొద్ది మంది మైనారిటీ నిరుద్మోగులకు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ సబ్సిడీ రుణాల చెక్‌లను అందజేశారు.

జిల్లాల వారిగా సబ్సిడీ రుణాల కింద ఎంపిక చేయబడిన వారి జాబితాను పంపించాలని జిల్లా అధికారులకు సూచించారు. త్వరలోనే అర్హులైన వారందరికీ సబ్సి డీ రుణాలు అందజేయడం జరుగుతుందని చైర్మన్ తెలిపారు. మైనారిటీల సంక్షేమ పథకాలన్నింటిని పకడ్బందీగా అమలు చేసేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. మైనారిటీల అభ్యున్నతి కోసం పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: లారీ డ్రైవర్ పై దోపిడి దొంగల దాడి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News