Sunday, January 12, 2025

కొత్త రూపంలో తెలంగాణ తల్లి

- Advertisement -
- Advertisement -

చేతిలో మొక్కజొన్న, వరి కంకులు, మెడలో మూడు
ఆభరణాలు కాళ్లకు మెట్టెలు, పట్టీలు, ఆకుపచ్చ
చీరలో ఆకట్టుకుంటున్న రూపం ఈ 9న
విగ్రహా ఆవిష్కరణకు సర్వం సిద్ధం

చేతిలో మొక్కజొన్న, వరి కంకులు, మెడలో మూడు ఆభరణాలు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు, ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి రూపం ఆకట్టుకుంటోంది. సచివాలయంలో ఏర్పాటు చేయబోయే ఈ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈనెల 9వ తేదీన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద సచివాలయ అధికారులు విగ్రహాన్ని తయారు చేయించారు.

ఇదిలా ఉండగా తెలంగాణ తల్లి విగ్రహం రూపులేఖల విషయంలో సిఎం రేవంత్ రెడ్డి పలు జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహం బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కుమార్తె కవితను పోలి ఉందన్న విమర్శలు వచ్చాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలతో దొరల అహంకారానికి గుర్తుగా ఉందని ఆరోపిస్తూ వచ్చారు. చివరకు ఆయన అన్నట్లుగానే కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్ధం చేయించి ఆవిష్కరణకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ విగ్రహ నమూనా బయటకు రాగా అది నిజమా కాదా అన్నది పక్కనబెడితే దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ ప్రారంభం కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News