న్యూఢిల్లీ : గ్రీకు వేదాంతి పైథాగరస్ సిద్ధాంతాల్లో ఒకటైన సంగీత సమ్మేళన సిద్ధాంతాన్ని కొత్త అధ్యయనం ప్రశ్నిస్తోంది. సంగీత సమ్మేళనం లేదా శ్రావ్యమైన స్వరాల కూర్పు శ్రోతలు మెచ్చుకునేలా గణిత నిష్పత్తుల్లో ఉండవలసిన అవసరం లేదని ఈ నూతన పరిశోధన వ్యాఖ్యానించింది. ఈ కొత్త అధ్యయనం శతాబ్దాల ప్రాచీన పాశ్చాత్య సంగీత సిద్ధాంతంపై ప్రభావం చూపిస్తుంది. విభిన్న సంస్కృతులకు చెందిన వాయిద్య పరికరాలపై విస్తృతమైన పరిశోధనలకు దారి తీస్తుంది. పాశ్చాత్య సంగీత స్వర మాధుర్యానికి సంబంధించి శ్రోతలకు కొన్ని నిర్దిష్టమైన తంత్రులు ఆహ్లాదంగా లేదా సంగీత అనుగుణ్యతగా వినిపిస్తాయి.
మిగతావి అంత ఆహ్లాదంగా వినిపించవని జర్మనీ లోని మ్యాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎంపిరికల్ ఏస్థెటిక్స్ పరిశోధక బృందం తమ అధ్యయనం ద్వారా వెల్లడించింది. ఈ అధ్యయనం జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో వెలువడింది. పైథాగరస్ సంగీత సిద్ధాంతంలో సంగీత స్వర వ్యవస్థ, దీనిలో అన్ని విరామాల ఫ్రీక్వెన్సీ నిష్పత్తులు 3 ః 2 నిష్పత్తిపైన , . ఆహ్లాదకరమైన స్వర శబ్దాలు 3 , 4 సంఖ్యలపైన ఆధారపడి ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు.అయితే సాధారణ శ్రోత వాస్తవానికి ఈ కార్డ్ అంటే శబ్దాలను గణిత నిష్పత్తిలో పరిగణించరని పరిశోధకులు తేల్చారు.
ఈమేరకు పరిశోధకులు సృష్టించిన ఆన్‌లైన్ లేబొరేటరీలో అమెరికా, దక్షిణ కొరియాకు చెందిన దాదాపు 4000 మంది 23 వివిధ ప్రయోగాల్లో పాల్గొన్నారు. ఈ ప్రయోగాల్లో పాల్గొన్న వారు వివిధ రకాల కార్డ్‌లను ఆలకించి స్లైడర్‌ను ఉపయోగించి తమకు ఆహ్లాదం కలిగించే కార్డ్‌ను సర్దుబాటు చేసుకోగలిగారు. ఈ ప్రయోగాల ద్వారా మొత్తం 2,35, 000 మానవ న్యాయనిర్ణయాలు వెలువడ్డాయని పరిశోధకులు వివరించారు.