Monday, December 23, 2024

3,6 తరగతులకు కొత్త సిలబస్

- Advertisement -
- Advertisement -

వచ్చే విద్యాసంవత్సరానికి (2024-25) సంబంధించి 3,6 తరగతుల సిలబస్ మారనుందని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ ) వెల్లడించింది. ఈ రెండు తరగతులకు మినహా మిగిలినవాటికి మారబోదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తన అనుబంధ పాఠశాలలకు సీబీఎస్‌ఈ తెలియజేసింది. 3,6 తరగతుల కొత్త సిలబస్‌తోపాటు పాఠ్యపుస్తకాలను త్వరలోవిడుదల చేస్తామని సీబీఎస్‌ఈ కి విద్య, పరిశోధన ,

శిక్షణ జాతీయ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ ) సమాచారం ఇచ్చింది. పాఠశాలలన్నీ కొత్త సిలబస్‌ను అనుసరించాలని సీబీఎస్‌ఈ డైరెక్టర్ (అకడమిక్స్) జోసెఫ్ ఎమ్మాన్యుయేల్ సూచించారు ‘6 వ తరగతి విద్యార్థులకు అదనంగా బ్రిడ్జి కోర్సు ఉంటుంది. 3 వ తరగతికి కుదించిన విధి విధానాలను ఎన్‌సీఈఆర్‌టీ విడుదల చేయనుంది. కొత్త విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాలల అధిపతులకు , ఉపాధ్యాయులకు సామర్థ నిర్వహణ శిక్షణ కార్యక్రమాలను చేపడతాం’ అని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News