Thursday, December 19, 2024

కొత్త టీచర్లతో కొంతమేర కొరత తీరినట్లే

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: డిఎస్‌సి 2024 ద్వారా ఎంపికైన కొత్త ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో చేరారు. ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో కొరత ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ పో స్టుల భర్తీకి నిర్ణయించింది. ఈమేరకు మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల డిఎస్‌సి నోటిఫికేషన్ జారీ చేసి, ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించా రు. తక్కువ సమయంలోనే ఫలితాలు వెల్లడించి ఎంపికైన ఉపాధ్యాయులకు జిల్లాలవారీగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఇచ్చారు. 10,00 6 మంది అభ్యర్థులను ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక చేయగా, కోర్టు కేసుల కారణంగా 1, 056 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకాలను నిలిపివేశారు. పోస్టింగులు పొందిన వారిలో దా దాపు 9 వేలకు పైగా కొత్త టీచర్లు విధుల్లో చేరా రు. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో చాలావరకు టీ చర్ల కొరత తీరినట్లేనని విద్యార్థులు, తల్లిదండ్రు ల్లో హర్షం వ్యక్తమవుతోంది. డిఎస్‌సి 2024 నో టిఫికేషన్‌లో అధికంగా 6,508 సెకండరీ గ్రేడ్ టీ చర్(ఎస్‌జిటి) పోస్టులే ఉన్నాయి. ఈ పోస్టుల భ ర్తీతో ప్రాథమిక పాఠశాలల్లో చాలావరకు ఉపాధ్యాయుల కొరత తీరింది. అయితే ఇతర ఉద్యోగాలు చేస్తున్న సుమారు వెయ్యి మంది వరకు ఆ యా ఉద్యోగాల నుంచి రిలీవ్ కాలేదు.

దాంతో వీరు విధుల్లో చేరడానికి మరికొంత సమయం పడుతోందని తెలిసింది. ఎస్‌జిటిలు చేరిన పాఠశాలల్లో అధికంగా ఏకోపాధ్యాయ పాఠశాలలే ఉ న్నట్టు సమాచారం. వీటిలో గరిష్టంగా 20 మంది విద్యార్థులే ఉన్నట్టు తెలిసింది. గతంలో రాష్ట్రంలో 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉండగా, డి ఎస్‌సి 2024 నియామకాలు పూర్తయిన తర్వాత మరో 12 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు తెలిసింది. ఇందులో అధికంగా 10 వేలకు పైగా ఎస్‌జిటి పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు హైస్కూళ్లలో పదోన్నతులు పొందిన టీచర్లు, పదవీ విరమణ పొందిన టీచర్ పోస్టులు భర్తీ చేయవలసిన ఉన్నది. ఇటీవల నిర్వహించిన పదోన్నతులలో దాదాపు 2 వేల స్కూల్ అసిస్టెంట్లు పదోన్నతులు పొందారు. పదోన్నతుల తర్వాత ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ప్రభుత్వం 6 వేల పోస్టులతో మరో డిఎస్‌సి నోటిఫిషన్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కొత్త డిఎస్‌సి నోటిఫికేషన్ వెలువడితే చాలావరకు రాష్ట్రంలో టీచర్ల కొరత తీరనున్నది. కొత్త టీచర్ల రావడంతోనే ఇటీవల జరిగిన సాధారణ బదిలీలు, పదోన్నతుల్లో బదిలీ అయిన ఉపాధ్యాయులకు కొత్త టీచర్లు రావడంతో విముక్తి లభించింది. ఒకే ఉపాధ్యాయుడు ఉండటం, ఇతర ప్రాంతాల నుంచి తీసుకునే వెసులుబాటు లేకపోవడంతో దాదాపు 7 వేల మంది టీచర్లు బదిలీ అయినప్పటికీ ఇంతకాలం రిలీవ్ కాలేదు. డిఎస్‌సి 2024 ద్వారా కొత్త టీచర్లు రావడంతో వారికి బాధ్యతలు అప్పగించి ఆయా పోస్టుల నుంచి రిలీవ్ అయ్యారు.

2017 తర్వాత డిఎస్‌సి నోటిఫికేషన్
రాష్ట్రంలో 2017లో తొలిసారిగా టిఎస్‌పిఎస్‌సి ఆధ్వర్యంలో టీచర్ పోస్టులకు నియామకాలు చేపట్టారు. 2017లో 8,792 ఉపాధ్యాయ పోస్టులు టిఎస్‌పిఎస్‌స్ నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం 2023లో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి బిఆర్‌ఎస్ ప్రభత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. 2023లో 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా, మొత్తం 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 నవంబరు 20 నుంచి 30వ తేదీ మధ్యలో రాతపరీక్ష నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పరీక్ష వాయిదా పడ్డాయి. కాగా, పాత డిఎస్‌సి 2023 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ రద్దు చేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో 11,062 పోస్టులతో ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News