Sunday, December 22, 2024

డబ్బుల పంపిణీకి సరికొత్త టెక్నిక్.. వింటే విస్తుపోవాల్సిందే..!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఎన్నికలు వచ్చాయంటే చాలు డబ్బులు, మద్యం పంపిణీ చేయడం సర్వసాధరణంగా మారింది. ఏ రాజకీయ పార్టీ అయినా డబ్బులు, మద్యం, బహుమతులు పంపిణీ చేయకుండా ఉండని పరిస్థితి నెలకొంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటీ పడి డబ్బులు పంపిణీ చేయడం జరుగుతోంది. అయితే ఎన్నికల సంఘం దీనిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠినంగా వ్యవహరిస్తుండం చూస్తూనే ఉన్నాం. ఎక్కడి కక్కడ తనిఖీలు చేస్తూ కోట్ల రూపాయలను సీజ్ చేయడం జరుగుతోంది. అయినప్పటికీ అభ్యర్థులు డబ్బుల పంపిణీకి సరికొత్త టెక్నిక్‌లు ఉపయోగిస్తున్నారు. నగర శివార్లలోని ఎల్‌బి నగర్‌లోనూ ఇలాంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది.

ఓ పార్టీ అభ్యర్థి ఓటర్లకి డబ్బులు పంచే విధానం వింటే మతి పోవాల్సిందే. ముందుగా మీ ఫోన్ కు ఒక మెసేజ్ వస్తుంది.. మీ కాలనీ లో ఉండే పలానా కిరాణా షాపుకి వెళ్ళి మేము మీకు మెసేజ్ చేసిన సరుకు కట్టమని మీరు అడగాలి.. ఉదా :- అరకిలో పంచదార , అరకిలో గోధుమపిండి, పావుకిలో బెల్లం,కిలో బియ్యం ,100గ్రా జీలకర్ర ఇలాగ…. ఆ మెసేజ్ షాప్ ఓనర్ కి చూపిస్తే.. అతను ఒక పొట్లం ఇస్తాడు.. ఇంటికి పోయి పొట్లం విప్పితే , మీ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉంటే అంతమంది డబ్బులు ఆ గోధుమపిండి లో దాక్కోని ఉంటాయి… డబ్బుల పంపిణీకి ఇదో రకం టెక్నిక్. ఇది నిజంగా విస్తుపోయేలా ఉంది కదూ…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News