Thursday, January 16, 2025

ఆగస్టు 1 నుంచి కొత్తగా ప్రారంభమయ్యే సినిమా షూటింగ్‌ల నిలిపివేత?

- Advertisement -
- Advertisement -

New Telugu Movie Shootings Stop from Aus 1st

తెలుగు సినీ పరిశ్రమలో కొత్తగా ప్రారంభమయ్యే సినిమా షూటింగులను ఆగస్టు 1 నుంచి నిలిపివేయాలని పెద్ద నిర్మాతలు భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే ప్రారంభమైన సినిమా షూటింగ్‌లను కొనసాగించాలని అనుకుంటున్నారు పెద్ద నిర్మాతలు. ఇక, వచ్చేనెల 1 నుంచి సినిమా చిత్రీకరణలు నిలిపివేసేలా కార్యాచరణ సిద్ధమైనట్టు సమాచారం. సినిమాల నిర్మాణ వ్యయం పెరగడం, సినిమాలపై ఓటీటీల ప్రభావం, సినీ కార్మికులు వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నిర్మాతలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. అయితే చిన్న నిర్మాతలు మాత్రం ఎప్పటిలాగే యథావిధిగా సినిమా షూటింగ్‌లను కొనసాగించాలని భావిస్తున్నారు. థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడం పెద్ద నిర్మాతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రారంభమయ్యే సినిమా షూటింగ్‌లను ఆగస్టు 1 నుంచి నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని వారు భావిస్తున్నట్టు తెలిసింది.

New Telugu Movie Shootings Stop from Aus 1st

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News