Monday, December 23, 2024

కరోనాకు వ్యతిరేకంగా ఇమ్యునిటీ ఎంత ఉందో తేల్చే కొత్త పరీక్ష

- Advertisement -
- Advertisement -

New test can tell how much immunity you have against Corona

అమెరికా పరిశోధకుల సులువైన కొత్త విధానం

బోస్టన్ : కొవిడ్ 19కు వ్యతిరేకంగా శరీరంలో ఇమ్యునిటీ రక్షణ ఏ స్థాయిలో ఉందో తేల్చి చెప్పగల కొత్త పరీక్ష ప్రక్రియను అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. వ్యాక్సినేషన్, ఇన్‌ఫెక్షన్ వల్ల కానీ లేదా రెండిటి సమ్మేళనం వల్ల కానీ ఇమ్యునిటీ ఎంతవరకు లభ్యమైందో ఈ పరీక్ష ద్వారా సులువుగా తెలుస్తుంది. ఈ విధమైన పరీక్ష సులువుగా ప్రజలకు అనుసంధానం కావడంతో కొవిడ్ ఇన్‌ఫెక్షన్ నివారణకు ముందుగా అదనంగా బూస్టర్ డోస్ తీసుకోవడం వంటి జాగ్రత్తలు ఏవి తీసుకోవాలో నిర్ణయించుకోడానికి వీలవుతుంది. జర్నల్ సెల్ రిపోర్టులో పేర్కొన్న విధానాల ప్రకారం వైరస్ నుంచి కణాలను రక్షించే యాంటీబాడీల తటస్థీకరణ స్థాయిలను ఈ పరీక్ష గణించ గలుగుతుంది. సాధారణంగా చాలా మంది తాము వైరస్ నుంచి ఎంతవరకు రక్షణ పొంది ఉంటున్నామో తెలుసుకోవాలని కాంక్షిస్తుంటారని పరిశోధకులు హోజన్ లీ చెప్పారు. అమెరికా లోని ఇంటెగ్రేటివ్ కేన్సర్ రీసెర్చి కోచ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) పరిశోధకులు గా లీ పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇమ్యునిటీ స్థాయిలను కనుగొనడానికి రక్త నమూనాలను లైవ్ వైరస్‌తో కలిపి పరీక్షిస్తుంటారు.

రక్త నమూనాలో ఎన్ని కణాలు వైరస్ వల్ల చంపబడ్డాయో దాన్ని బట్టి అంచనా వేసి తెలుసుకుంటారు. ఈ ప్రక్రియకు శిక్షణ పొందిన సిబ్బంది ల్యాబ్‌లో పనిచేసే వారై ఉండాలి. అయినా వారు తక్షణం ఫలితాలను తెలుసుకోలేరు. అందుకని పరిశోధకులు లేటరల్ ఫ్లో ఎస్సే అనే ప్రక్రియను కొత్తగా తెరపైకి తెస్తున్నారు. ఈ విధానంలో పేపర్ స్ట్రిప్స్ వాడతారు. రక్తనమూనాలను వైరల్ ఆర్‌బిడి ప్రొటీన్‌తో కలిపి గోల్డ్ పార్టికల్స్‌తో లేబిల్ చేస్తారు. దాన్ని పేపర్ స్ట్రిప్ పై అంటిస్తారు. ఆ నమూనా లోకి యాంటీబాడీలు ప్రవేశించడానికి వైరల్ ప్రొటీన్‌తో అనుసంధానం కావడానికి కొంత సమయం ఇస్తారు. నమూనా తాలూకు కొన్ని బిందువులను పేపర్ స్ట్రిప్‌పై ఉంచుతారు. రెండు పరీక్షల ప్రక్రియలు ఇందులో ఉంటాయి. వీటిలో ఒకటి స్వేచ్ఛగా ఉన్న వైరల్ ఆర్‌బిడి ప్రొటీన్లను ఆకర్షిస్తుంది. రెండోది ఆర్‌బిడిచే ఆకర్షింప బడుతుంది. తటస్టీకరణ చెందిన యాంటీబాడీల వశమౌతుంది. రెండో లైన్ ద్వారా వచ్చే సంకేతం యాంటీబాడీల ఎక్కువస్థాయి తటస్ఠీకరణను తెలియచేస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News