- Advertisement -
హైవేలపై నూతన యూజర్ ఫీ(టోల్) రేట్ల లెక్కింపును చేపట్టడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఎఐ)కు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. అయితే కొత్త రేట్లు లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచే అమలులోకి రావాలని ఇసి కోరింది. టోల్ చార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్‌హెచ్‌ఎఐని ఇసి కోరింది. ఈ విషయమై కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నుంచి వచ్చిన లేఖపై స్పందిస్తూ ఇసి ఈ ఆదేశాలు జారీచేసింది. టోల్ చార్జీల వార్షిక సవరణ సరాసరి 5 శాతం వరకు ఉంటుంది. ఇది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్డ్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో అమలులోకి రావలసి ఉంది. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ఏడు దశలలో జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్నది.
- Advertisement -