Monday, January 20, 2025

ఏప్రిల్ నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఉల్లంఘిస్తే చార్జ్‌షీట్

- Advertisement -
- Advertisement -

New Traffic Challans from April in Hyderabad

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని మూడు కమిషనరేట్‌ల పరిధిలో ఏప్రిల్ నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలు చేయనున్నారు. ఈక్రమంలో ఏప్రిల్ నుంచి ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తాయనున్నామని, ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చార్జిషీట్లు వేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ హెచ్చరించారు. కోవిడ్ కారణంగా గ్యాప్ ఇచ్చామని ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే మునుపటి లాగే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతామన్నారు. అలాగే హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్పీడ్ లిమిట్ ఒకేలా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అనతికాలంలో స్పీడ్ లిమిట్ విధానం అమల్లోకి తెస్తామన్నారు. అదేవిధంగా ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు ఉంటాయని తాగి వాహనం నడిపేతే జైలుకు పంపుతామని హెచ్చరించారు. వాహనాల అద్దాలపై స్థాయిని మెన్షన్ చేస్తూ స్టిక్కర్స్ అంటించరాదని, సుప్రీంకోర్టు గైడ్ లెన్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు.

నిబంధనలకు విరుద్దంటూ స్టిక్కర్స్ వేసుకొని తిరిగితే చర్యలు తప్పవని, పోలీస్ శాఖ ఇచ్చిన స్టిక్కర్స్ మాత్రమే వాడాలన్నారు. రూల్స్ పాటించని వారిపై 177 మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని ఆయన వివరించారు. తెలంగాణలో పెండింగ్ ఛలాన్లపై పోలీస్ శాఖ ఇచ్చిన బంఫర్ ఆఫర్ కు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. 650 కోట్ల రూపాయలకు పైగా విలువైన పెండింగ్ ఛలాన్లు క్లియర్ అయ్యాయన్నారు. రాయితీ పోనూ 190 కోట్లు వసూలైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు కోటి 85 లక్షల ఛలాన్లు క్లియర్ చేశారని రోజుకు ఏడు నుండి పది లక్షల పెండింగ్ చలాన్లను చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చార్జిషీట్లు వేస్తామని సిపి రంగనాథ్ తెలిపారు.

New Traffic Rules from April in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News