Thursday, January 23, 2025

హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌.. అతిక్రమిస్తే అంతే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రూల్స్ కఠినతరం చేసిన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం నుంచి హైదరాబాద్‌ నగరంలో కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భారీ వాహనాలపై ఆంక్షలు విధించారు.

ఇకనుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే సిటీలోకి అనుమతించనున్నారు.  భారీ ట్రక్కులు, లారీలు సిటీలోకి రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతి ఉన్న మార్గాల ద్వారానే ఎంట్రీ ఇవ్వనున్నాయి. రూల్స్ అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News