Sunday, November 3, 2024

జడ్జిలను తూలనాడటం తగునా?

- Advertisement -
- Advertisement -

New trend of government maligning judges unfortunate

ప్రభుత్వాలకు సిజెఐ ప్రశ్న

న్యూఢిల్లీ : ప్రభుత్వాలే న్యాయమూర్తులను కించపర్చేలా వ్యవహరించడం శోచనీయం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఈ తంతు ముదిరిందని అన్నారు. తీర్పులు రుచించకపోతే ప్రభుత్వాలు కోర్టులను న్యాయమూర్తులను తిట్టిపోస్తోందని వ్యాఖ్యానించారు. వ్యాజ్యాలలో తీర్పులు ఏకపక్షం రావడం కుదరదనే విషయం ప్రభుత్వానికి తెలియదా అని నిలదీశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాఖలైన పిటిషన్ల విచారణ దశలో ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు వెలువరించారు. ప్రభుత్వం కానీ ఇతరులు ఎవరైనా కానీ ఎటువంటి వ్యాజ్యంతో అయినా కోర్టులను ఆశ్రయించవచ్చు. అయితే జడ్జిలను దూషించే రీతిలో మాట్లాడటం మానుకుంటే మంచిదని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News