Sunday, November 24, 2024

గోదావరిపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి

- Advertisement -
- Advertisement -

New tribunal should be set up on Godavari river

మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిలో నీటి లభ్యతపై సాంకేతిక పరంగా సమగ్ర అధ్యయనం జరిపించి నీటివాటాలు తేల్చేందుకు కొత్తగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాలు గోదావరి నదీయాజమాన్య బోర్డును డిమాండ్ చేశాయి. బుధవారంనాడు జలసౌధలో గోదావరినదీ సమావేశం జరిగింది. చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ అధ్యక్షతన జరిగి ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరి రజత్ కుమార్, ఎపి నీటిపారుదల శాఖ ముఖ్య శశిభూషన్ కుమార్‌తోపాటు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలు ,బోర్డు సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో గెజిట్ నోటిఫికేషన్ అ మలు, గోదావరి నదిపై రెండు రా ష్ట్రాల్లో నిర్మించిన ప్రాజెక్టులకు సం బంధించిన డిపిఆర్‌లు, వాటి అనుమతులు బోర్డు నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం , సీడ్ మని తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.

మూడు ప్రాజెక్టులకు సిడబ్ల్యుసి
రెకమెండ్ చేసింది:రజత్ కుమార్

గోదావవరి నదియాజమాన్య బోర్డు సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి రజత్ కుమార్ మీడియాకు సమావేశంలో చర్చించిన అంశాలను వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరి నదీజలాలను ఇతర బేసిన్లకు మళ్లిస్తే అప్పర్ రైపేరియన్ రైట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 45టిఎంసిలు రావాలని బోర్డుకు తెలిపామన్నారు. కర్నాటక , మహారాష్ట్రలకు దక్కే 35టిఎంసిలకు ఇప్పటికే ఆ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టి నీటిని వినియోగించుకుంటున్నట్టు బోర్డు దృష్టికి తీసుకుపోయినట్టు తెలిపారు. నదిలో నీటిలభ్యతపై అధ్యయనం జరపాలని, నీటి పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్నారు. గోదావరినదిపై తెలంగాణలో నిర్మిస్తున్న చనాకాకొరాటా, చిన్నకాళేళ్వరం , చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల సాగునీటి పధకాల డిపిఆర్‌లను సమర్పించామన్నారు. వీటిని సిడబ్యుసి కూడా పరిశీలించి అభిప్రాయంకోసం పంపగా వీటిపై బోర్డులో చర్చజరిగిందన్నారు. బోర్డు చైర్మన్ రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తెలపమని కోరినట్టు తెలిపారు. ఎపి ప్రభుత్వం ఈ మూడు ప్రాజెక్టుల డిపిఆర్‌లను వ్యతిరేకించిందన్నారు. వాటికి సిడబ్యుసితోపాటు హైడ్రాలజికి చెందిన అన్ని క్లియరెన్సులు ఉన్నట్టు బోర్డు దృష్టికి తీసుకుపోయామన్నారు.

ఈ మూడు డిపిఆర్‌లపై ఎపికి ఇప్పటికే చాలా సార్లు వివరణ ఇచ్చామని, మళీ జాప్యం జరగకుండా ఇక ఎపి ప్రభుత్వ అభ్యంతరాలను పట్టించుకోవద్దని బోర్డును కోరినట్టు తెలిపారు. బోర్డు చైర్మన్ కూడా ఏపి ప్రభుత్వ అభ్యంతరాలను తిరస్కరించినట్టు తెలిపారు. రెండు రాష్టాల అభిప్రాయాలను రికార్డు చేసి సిడబ్యుసికి పంపేందుకు చైర్మన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గోదావరినదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నీ పాత పథకాలనే అని రజత్ కుమార్ స్పష్టం చేశారు. గోదావరి నదిలో నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం జరపాలని, నీటి కేటాయింపులకోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని బోర్డును డిమాండ్ చేశామన్నారు. గెజిట్ అమలుపై కూడా చర్చజరిగిందన్నారు. సీలేరు జలవిద్యుత్ ప్రాజెక్టు విద్యుత్‌ను కూడా తెలంగాణకు పంచాలని కోరామన్నారు. సీలేరు వివరాలు ఇవ్వాలని బోర్డు చైర్మన్ ఏపికి సూచించారని ఎపి అధికారులు కూడా అందుకు అంగీకారం తెలిపారన్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు చర్చలో భాగంగా సబ్ కమిటి ద్వారా అధ్యయనం పూర్తయ్యాక నివేదిక వస్తుందని తెలిపామన్నారు. పెద్దవాగును బోర్డుకు అప్పగింతపై ఇంకా స్క్రూటిని జరుగుతోందని రజత్ కుమార్ వెల్లడించారు.

ట్రిబ్యునల్ ఏర్పాటును కోరాం :శశిభూషన్ కుమార్

గోదావరి నదిలో నీటివాటాలు తేల్చేందుకు ట్రిబ్యునల్ వేయాలని, అదే విధంగా నదిలో నీటిలభ్యతపై సమగ్ర అధ్యయనం చేయించాలని బోర్డును కోరగా ఈ రెండు అంశాలు తమపరిధిలో లేవని బోర్డు చైర్మన్ వెల్లడించారని ఏపి నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషన్ కుమార్ మీడియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న చనాకాకొరాటా, చౌటుపల్లి హన్మంతరెడ్డి , చిన్నకాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు ట్రిబ్యునల్ నీటికేటాయింపులు చేయలేదని, అందువల్ల ఆ ప్రాజెక్టుల డిపిఆర్‌లకు బోర్డు ముందు అభ్యంతరాలు తెలిపామన్నారు.అశాస్త్రీయంగా సిడబ్యుసి ఈ ప్రాజెక్టుల డిపిఆర్‌కు ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నించారు. ఈ ఎత్తిపోతల పథకాల వల్ల దిగువన ఉన్న ప్రాజెక్టులకు నీటిలభ్యత తగ్గిపోందని బోర్డు చైర్మన్‌కు తెలిపామన్నారు. దీనిపై తెలంగాణ సీఎస్ కొద్దిసేపు వాదించారన్నారు. ఇటువంటి వాదనలు ఏడాది కాలంగా జరుగుతున్నవే అని తెలిపారు. సీలేరు ప్రాజెక్టు వివరాలు ఏపార్మాట్‌లో కావాలో లేఖ రాస్తే వివరాలు అందజేస్తామని బోర్డుకు తెలిపామన్నారు. బోర్డుకు సిబ్బంది నియామకాలు , నిర్వహణకు నిధులు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయని శశిభూషన్ కుమార్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News