Thursday, January 23, 2025

మంత్రి శ్రీనివాసగౌడ్ కేసులో కొత్త కోణం

- Advertisement -
- Advertisement -

New twist in Minister Srinivas Goud murder case

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్ చేసుకుంది. శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సిపి సహా 18 మందికి మహబూబ్‌నగర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మహబూబ్‌నగర్ కోర్టులో రాజు, పుష్పలత పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ ఇసికి ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారని రాజు తెలిపారు.ఈక్రమంలో తన ఇంట్లో సిసిటివి, హర్డ్ డిస్క్‌ను దొంగించారని రాజు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న తన భర్త విశ్వనాథ్‌ను కిడ్నాప్ చేశారని పుష్పలత ఫిర్యాదు చేశారు. హత్యకు కుట్ర కేసులో గతంలో రాజు, విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ బయటకొచ్చాక మహబూబ్‌నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News