Sunday, December 22, 2024

ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ వివాదంలో కొత్తమలుపు

- Advertisement -
- Advertisement -

హనుమకొండ: రోజురోజుకు రసవత్తరంగా మారుతున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య వివాదంలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ వివాదంపై సుమోటోగా తీసుకున్న జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పోలీసు శాఖను ఆదేశించాయి.

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్యల వివాదం కొత్త మలుపు తిరిగింది. జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు ఈ వివాదాన్ని సుమోటోగా స్వీకరించాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసు శాఖను ఆదేశించారు.

మహిళా కమిషన్ ఆదేశాల మేరకు కాజీపేట ఏసీపీ, సర్పంచ్ నవ్యలకు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే రాజయ్యపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 3 రోజుల్లో పూర్తి ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News