Monday, December 23, 2024

వివేకా కేసులో మరో ట్విస్ట్

- Advertisement -
- Advertisement -
సీబీఐకి సాయం చేసేందుకు సునీతకు కోర్టు అనుమతి

హైదరాబాద్ : ఎపిలో తీవ్ర సంచలనం రేపుతున్న వివేకా హత్య కేసులో శుక్రవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐకి పలు అవాంతరాలు ఎదురవుతుండటం, సిబిఐ దర్యాప్తుకు మద్దతుగా వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఆమె దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై విచారణ జరిపిన హైదరాబాద్ సిబిఐ కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐకి సహకరించేందుకు తనకు, తన న్యాయవాదులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సునీతారెడ్డి హైదరాబాద్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేస్తూ తీర్పు నిచ్చింది. సిబిఐ విచారణకు అవసరమైన సాయం అందించేందుకు సునీతారెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది.

దీంతో ఇకపై సిబిఐతో కలిసి సునీత అధికారికంగా పనిచేసేందుకు అనుమతి దొరికినట్లయింది. అయితే సునీతారెడ్డి పిటిషన్‌పై తీర్పు ఇచ్చే సందర్భంలో సిబిఐ కోర్టు ఓ కీలక సూచన చేసింది. సిబిఐకి ఈ కేసు దర్యాప్తులో సునీతారెడ్డి, ఆమె న్యాయవాదులు అందించే సాయం సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే ఉండాలని సూచించింది. దీన్ని ఉల్లంఘించినట్లు తేలితే భవిష్యత్తులో ఆమెకు ఇచ్చిన అనుమతిని రద్దు చేసేందుకు సిబిఐ కోర్టుకు అధికారం ఉంటుంది. వివేకా కేసులో దర్యాప్తు పూర్తి చేసేందుకు సిబిఐకి సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ నెల 30 వరకూ గడువు విధించింది. ఈలోపు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఆటంకాలు తప్పడం లేదు. ఈ తరుణంలో సునీతారెడ్డిని సాయం చేసేందుకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News