Sunday, November 24, 2024

కొత్త వేరియెంట్లు

- Advertisement -
- Advertisement -

New type of corona AY.4.2 cases in the country

మళ్లీ కోర చాస్తున్న కరోనా

ఎవై.4.2 కలకలం, కర్ణాటకలో ఏడుగురికిపాజిటివ్, అప్రమత్తమైన అధికారులు కొత్త వేరియంట్ కట్టడికి చర్యలు

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి మరో రూపు మార్చుకుని పంజా విసురుతున్నది. దేశంలో కొత్త రకం కరోనా ఎవై.4.2 కేసులు వెలుగుచూస్తుండటం కలకలం రేపుతోంది. బ్రిటన్‌లో కేసుల పెరుగుదలకు కొత్తగా వెలుగుచేసిన ఎవై.4.2 వేరియంటే కారణమని భావిస్తున్నారు. ఈ వేరియంట్‌ను డెల్టా ప్లస్‌గా పిలుస్తున్నారు. ఇది డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. బ్రిటన్ ఆరోగ్య భద్రతా సంస్థ ఇటీవలే దీనిని వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్‌గా పేర్కొన్నది. భారత్‌లోనూ ఎవై.4.2 రకం కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఈ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. అయితే ఎవై 4.2 వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ, ప్రాణాంతకం కాదని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని కొత్త ఉపవేరియంట్లు పుట్టుకొచ్చేందుకు ఏవై రకం దారితీస్తుందా అన్నదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. అవును అని ఇప్పుడే అనడం తొందరపాటే అవుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దీనిపై నిరంతర నిఘా అవసరం అంటున్నారు.

కర్ణాటకలో ఏడుగురికి ఎవై.4.2 రకం కరోనా

కర్ణాటకలో ఏడుగురికి ఎవై.4.2 రకం కరోనా వేరియంట్ సోకినట్లు తేలింది. బాధితుల్లో ముగ్గురు బెంగళూరుకు చెందిన వారు కాగా.. మిగతా నలుగురు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమై.. వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టారు. ఈ వేరియంట్ బాధితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించేందుకు.. ఒక బృందం బాధితుల ఇళ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహించనుందని అధికారులు చెప్పారు.ఎవై.4.2 రకం అనుమానిత వ్యక్తుల నమూనాలను జన్యు పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు ఆ ఆరోగ్య మంత్రి సుధాకర్ తెలిపారు. బెంగళూరులోని నేషనల్ సెంట ర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్‌కు వీటిని పంపినట్లు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News