Wednesday, January 22, 2025

కొత్త పార్లమెంట్‌లో ప్రత్యేక సెషన్ .. సిబ్బందికి కొత్త యూనిఫాం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 18న పార్లమెంట్ పాత భవనంలో ఈ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతాయి. వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ 19 నుంచి ఈ సమావేశాలను కొత్త భవనం లోకి మార్చనున్నారు. అయితే నూతన పార్లమెంట్ భవనం లోకి వెళ్లే సమయంలో సిబ్బంది కొత్త యూనిఫాం ధరించి వెళ్లనున్నట్టు సమాచారం. ఈ యూనిఫాంను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రత్యేకంగా రూపొందించింది.

ఇది నెహ్రూ జాకెట్ల మాదిరిగా ఊదా ఎరుపు రంగు లేదా గులాబీ రంగులో ఉంటాయి.వారి చొక్కాలు పువ్వుల డిజైన్‌తో ముదురు గులాబీ రంగులో ఉంటాయి. ఉద్యోగులు ధరించే ప్యాంట్లు ఖాకీ రంగులో ఉంటాయి. మరికొన్ని మార్పులతో భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా డిజైన్ చేశారు. ఉభయ సభల్లో కూడా మణిపురి తలపాగాలు ధరించేలా నిర్ణయించారు. పార్లమెంట్ భవనంలో ఉన్న భద్రతా సిబ్బందికి సఫారీ సూట్లకు బదులుగా మిలిటరీ తరహాలో డిజైన్ ఉంటుందని ఓ వార్తా సంస్థ వెల్లడించింది.

ఈ ప్రత్యేక ఎజెండాతో జరిగే చర్చలు ఫలవంతం కావాలని కేంద్రం ఆశిస్తున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగస్టు 31న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భారత దేశానికి ఇండియా పేరు నుంచి భారత్‌గా మార్చే తీర్మానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ ఏడాది మే 28న ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News