Sunday, January 19, 2025

ఎలాంటి వేరియంట్లనైనా నియంత్రించే కొత్త వ్యాక్సిన్లు తప్పనిసరి : డబ్ల్యుహెచ్ ఒ

- Advertisement -
- Advertisement -

New vaccines that control any variants are mandatory: WHO

వ్యాప్తిలో డెల్టా వేరియంట్‌ను అధిగమిస్తున్న ఒమిక్రాన్

జెనీవా : ఒమిక్రాన్ లేదా భవిష్యత్తులో సంక్రమించే మరే వేరియంట్లనైనా అత్యంత ప్రభావవంతంగా నియంత్రించగల సామర్ధ్యం కలిగిన కొత్త వ్యాక్సిన్లను తక్షణం రూపొందించవలసిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ సీనియర్ అధికారి మరియా వాన్ ఖెర్కోవ్ సూచించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించిన స్థాయిలో వ్యాక్సిన్లు ఆమేరకు నిరంతం రక్షణ కల్పిస్తాయన్న భరోసా లభించాలని పేర్కొన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా డెల్టా వేరియంట్‌ను అధిగమించి ప్రపంచం మొత్తం మీద ఆధిపత్యాన్ని సాధిస్తోందని, ఇతర వేరియంట్లతో పోలిస్తే వ్యాధి తీవ్రత తక్కువ గానే ఉన్నప్పటికీ ఇమ్యునిటీని తప్పించుకునే చాకచక్యం ఒమిక్రాన్‌కు ఉన్నట్టు సాక్షాధారాలు పెరుగుతున్నాయని మరియా వాన్ ఖెర్కోవ్ హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇన్‌ఫెక్షియస్ డిసీజ్ ఎపిడెమియోలజిస్ట్ అండ్ కొవిడ్ 19 టెక్నికల్ లీడ్‌గా ఖెర్కోవ్ పదవిని నిర్వహిస్తున్నారు. కుహనా సంభావ్యత కారణంగా ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ సామర్ధంపై వెలువడిన తొలి అంచనాలను మనం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలని, డెల్టాతో పోలిస్తే ఈ ప్రాథమిక ఫలితాలు మొత్తం మీద ఒమిక్రాన్ నియంత్రణ వ్యాక్సిన్ల సామర్ధాన్ని తగ్గించాయని చెప్పారు.

ఒమిక్రాన్ నియంత్రణలో బూస్టర్ వ్యాక్సినేషన్ సమర్ధంగా పనిచేస్తున్నట్టు కనిపిస్తోందని, కానీ వ్యాక్సిన్ ఎంతవరకు రక్షణ కల్పిస్తుందో తేల్చడానికి మరింత డేటా చాలా అవసరమని తెలిపారు. ఇదివరకటి కరోనా వేరియంట్ల కంటే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తక్కువ లోనే రెట్టింపు సమయం వ్యాప్తిని చూపిస్తోందని, వ్యాక్సిన్ పొందినా, లేదా ఇదివరకు సార్స్ కొవి 2 సంక్రమించినా ఆయా వ్యక్తుల్లో కూడా దీని వ్యాప్తి వేగంగా కనిపిస్తోందని ఖెర్కోవ్ తెలియచేశారు. ఎక్కడైతే జన్యుక్రమం సరిగ్గా ఉందో ఆ దేశాల్లో ఒమిక్రాన్ కనుగొనడమౌతోందని, ఇంకా ప్రపంచం లోని ఇతర దేశాల్లోనూ ఇది విస్తరిస్తుందని చెప్పారు. దీని తీవ్రత తక్కువే అన్న సమాచారం ఉన్నప్పటికీ దీనివల్ల ఇంకా ప్రజలు ఆస్పత్రిపాలు అవుతుండడంతో ఇది తేలికపాటి వ్యాధి కాదని వివరించారు. జనవరి 3 నుంచి 9 వరకు ప్రపంచం మొత్తం మీద 15 మిలియన్‌కు మించి కొత్త కేసులు పెరిగాయని, అంతకు ముందటి వారం కన్నా 55 శాతం ఎక్కువని తెలిపారు. గతవారం కొత్తగా 43,000 మంది మరణించారని, జనవరి 9 నాటికి కేసులు 304 మిలియన్ వరకు నిర్ధారణ కాగా, 5.4 మిలియన్ వరకు మరణాలు సంభవించాయని చెప్పారు. కొత్త కేసులు అత్యధికంగా 46,10,359 వరకు అమెరికాలో బయటపడి 73 శాతం ఎక్కువగా నమోదయ్యాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News