Thursday, January 23, 2025

అధునాతన సౌకర్యాలతో నూతన వందే భారత్ రైళ్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నూతన వందే భారత్ రైళ్లు అనేక అధునాతన సౌకర్యాల మేళవింపుతో వస్తున్నాయి. మరీ ముఖ్యంగా వందే భారత్‌ను ప్రయాణికులకు ఇష్టమైన రవాణా మార్గంగా తీర్చిదిద్దడానికి యత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు భారతీయ రైళ్లలో 25 జతల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్- తిరుపతి, సికింద్రాబాద్ అలాగే సికింద్రాబాద్, విశాఖపట్నం ,సికింద్రాబాద్ స్టేషన్‌ల మధ్య రెండు జతల వందే భారత్ రైళ్లు దాదాపు గంటకు 120 కిమీ వేగంతో విజయవంతంగా నడుస్తున్నాయి.

రైల్వే మంత్రిత్వశాఖ దక్షిణ మధ్య రైల్వేతో సహా భారతీయ రైల్వేల అంతటా అదనంగా మరికొన్ని వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. సౌకర్యాల పెంపుదలలో భాగంగా భారతీయ రైల్వేలు నిరంతరం ప్రయాణికుల నుండి సూచనలు, అభిప్రాయాలను సేకరిస్తున్నది. ప్రయాణికుల అనుభవం , అభిప్రాయాల ఆధారంగా నూతన వందే భారత్ రైళ్లను మరింత సౌకర్యవంతంగా, సురక్షితమైనదిగా అత్యంత ఆకర్షితంగాను అలాగే అధిక శక్తితో నడపడానికి అనేక మార్పులు చేర్చారు. అంతే కాకుండా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా సీట్ల వాలు కోణంను 17 నుండి 19 డిగ్రీలకు పెంచారు.

ఈ రైలు సీట్ల కింది భాగంలో మొబైల్ ఛార్జింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. టాయిలెట్లలో మొరుగైన లైటింగ్ సదుపాయాలను కల్పించారు. కాగా లోకో పైలెట్‌కు అనువుగా ఉండేందుకు డ్రైవర్ కంట్రోల్ ప్యానెల్‌లో ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్‌ను మార్చారు. ఇలాంటి పలు మార్పులతో నూతన వందే భారత్ రైళ్లు మరింత సౌకర్యవంతంగా అందుబాటులోకి వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News