విస్తరిస్తున్న కరోనా తరహా
మహమ్మరి వణుకుతున్న
ప్రపంచం హ్యూమన్
మోటానియో వైరస్‌గా
గుర్తింపు దేశ
ఉత్తరప్రాంతంలో తీవ్ర
ప్రభావం ఫ్లూ,
ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల
మాదిరిగానే లక్షణాలు
నిమోనియాకు
దారి తీయవచ్చు
అప్రమత్తమైన భారత్
ఆందోళన అవసరం
లేదని అభయం
మహమ్మరి వణుకుతున్న
ప్రపంచం హ్యూమన్
మోటానియో వైరస్‌గా
గుర్తింపు దేశ
ఉత్తరప్రాంతంలో తీవ్ర
ప్రభావం ఫ్లూ,
ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల
మాదిరిగానే లక్షణాలు
నిమోనియాకు
దారి తీయవచ్చు
అప్రమత్తమైన భారత్
ఆందోళన అవసరం
లేదని అభయం
బీజింగ్: చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ కలక లం రేపుతోంది. ఈ వైరస్ బారిన పడిన బాధితులు ఆస్పత్రుల ఎదుట భారీ క్యూలు కడుతున్నారన్న వా ర్తలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. 2001 లో నే ఈ వైరస్‌ను గుర్తించారు. ఇప్పుడు చైనా ఉత్తర ప్రాంతంలో ప్రభావం చూపిస్తోంది. ఆసియా దేశా లు కూడా దీనిపై దృష్టి సారించాయి. ఈ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు.
దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారి తీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్‌కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ప్రకారం , చిన్నారులు , వృద్ధులు, బలహీనమైన రోగ నిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ.

దీని వ్యాప్తికి దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్లు, వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం, తాకడం వంటి చర్యలు కారణమవుతాయి. వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన తర్వాత నోరు, ముక్కు, కళ్లను తాకినా ఇది సంక్రమిస్తుంది. అయితే చిన్నపాటి ముందు జాగ్రత్తలతో ఈ వైరస్ సంక్రమించకుండా చూసుకోవచ్చు. సబ్బుతో 20 సెకండ్ల పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోని చేతులతో ముఖాన్ని తాకకుండా చూసుకోవాలి. వైరస్ బారిన పడిన వ్యక్తులకు దూరం పాటించాలి. తరచూ తాకాల్సి వచ్చే పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. వైరస్ బారిన పడిన వారు దగ్గు,తుమ్ము వచ్చేప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆ వ్యక్తులు తమ వస్తువులను ఇతరులతో పంచుకోకుండా చూసుకోవాలి.లక్షణాలు కనిపిస్తున్నప్పుడు నలుగురిలోకి వెళ్లడం కంటే ఇంట్లో రెస్ట్ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దానివల్ల వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు.
చైనా కొత్త వైరస్‌తో ఆందోళన అవసరం లేదు : డీజీహెచ్‌ఎస్ అధికారి
న్యూఢిల్లీ : చైనాలో వ్యాప్తి చెందుతున్న హ్యూమన్ మెటానిమోవైరస్ పట్ల భయపడాల్సిన అవసరం లేదని, శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డిజిహెచ్‌ఎస్ ) ఉన్నతాధికారి డాక్టర్ అతుల్‌గోయల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వైరస్‌కు ప్రత్యేకంగా ఎలాంటి చికిత్స లేదని అందువల్ల ముందు జాగ్రత్త చర్యలే తక్షణం అవసరమని సూచించారు. “ చైనాలో హెచ్‌ఎంపీవీ వైరస్ విజృంభిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్ సాధారణ జలుబుకు కారణమయ్యే ఇతర శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే ఉంటుంది. వృద్ధులు, పిల్లల్లో ఇది ఫ్లూ వంటి లక్షణాలను చూపిస్తుంది.

మనదేశంలో శ్వాసకోశ సంబంధిత వైరస్‌ల వ్యాప్తికి సంబంధించిన డేటాను విశ్లేషించాం. డిసెంబర్ వరకు ఉన్న డేటాలో గణనీయమైన మార్పులేమీ లేవు. మా సంస్థల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నమోదైన కేసులేవీ రాలేదు. శీతాకాలంలో శ్వాసకోశ వైరస్ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. ఇందుకోసం సాధారణంగా ఆస్పత్రులు, ఇతర సామగ్రి , పడకలను సిద్ధంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ప్రజలు అన్ని శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నియంత్రణకు సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎవరికైనా దగ్గు,జలుబు ఉంటే అలాంటి వ్యక్తులు ఎక్కువ మందితో కలవడం మంచిది కాదు. తద్వారా ఇన్‌ఫెక్షన్ వ్యాప్తికి అవకాశం ఉండదు. మామూలుగా దగ్గు,తుమ్ము వచ్చినప్పుడు రుమాలు లేదా టవల్‌ను అడ్డుగా పెట్టుకోండి. జలుబు, జ్వరం ఉంటే అవసరమైన మందులు తీసుకోండి. ” అని ఆయన అన్నారు.
వైరస్ తీవ్రత తక్కువే .. చైనా వెల్లడి
బీజింగ్: చైనాలో విజృంభించిన హెచ్‌ఎంపీవీ వైరస్‌పై ఆదేశం స్పందించింది. వ్యాప్తిని తక్కువ చేసే ప్రయత్నం చేసింది. ఈ వైరస్ కారణంగా ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిందని వస్తోన్న నివేదికలను తోసిపుచ్చింది. శీతాకాలంలో వచ్చే ఈ శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే తక్కువ గానే ఉందని పేర్కొంది. విదేశీయులు తమ దేశంలో పర్యటించడం సురక్షితమేనని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. “ ఉత్తరార్ధగోళంలో శీతాకాలంలో ఈ ఇన్‌ఫెక్షన్లు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయి. వ్యాధుల తీవ్రత తక్కువ గానే కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే తక్కువ స్థాయిలోనే వ్యాప్తిలో ఉన్నాయి. చైనా పౌరులతోపాటు ఇక్కడున్న విదేశీయుల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని భరోసా ఇస్తున్నా. చైనాలో పర్యటించడం సురక్షితమే” అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావోనింగ్ పేర్కొన్నారు. శీతాకాలంలో ఈ వ్యాధుల నిర్మూలన, నియంత్రణకు సంబంధించి నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు.

- Advertisement -