Monday, December 23, 2024

నేటి నుంచే కొత్త జీతాలు

- Advertisement -
- Advertisement -
దాదాపు 41 వేల మంది కార్మికులు, ఉద్యోగులు, సూపర్‌వైజర్లకు ప్రయోజనం
కొత్త జీతాల అమలుతో ఏడాదికి రూ. 1,000 కోట్ల అదనపు వ్యయం
కోల్ ఇండియా కన్నా ముందే అమలు జరిపిన సింగరేణి
యాజమాన్యం చొరవను గమనించి లక్ష్యాల సాధనకు ఉద్యోగులు శ్రమించాలి
సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ పర్సనల్ ఎన్.బలరామ్ వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : జాతీయస్థాయిలో ఇటీవలనే కుదిరిన 11వ వేజ్ బోర్డు వేతనాలను సింగరేణి కార్మికులకుతక్షణమే అమలు జరపాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ సిఎండి ఎన్. శ్రీధర్ ఆదేశం మేరకు ఫైనాన్స్ అండ్ పర్సనల్ అధికారి ఎన్. బలరామ్ స్వీయ పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేసి జూన్ నెల జీతాలను నేడు ( 3వ తేదీన) కార్మికుల బ్యాంకు ఖాతాలలో జమ చేయనుంది. గత పది వేజ్ బోర్డు జీతాల అమలు తో పోలిస్తే ఇది ఒక సంచలన నిర్ణయంగా పేర్కొనవచ్చు. గతంలో వేజ్ బోర్డు నిర్ణయాలు జరిగిన తర్వాత జీతాల చెల్లింపుకు నెలల తరబడి సమయం పడుతుండేది .పైగా కోలిండియా లో అమలు జరిపిన తర్వాతనే సింగరేణిలో అమలు జరిపితుండేవారు .కానీ ఈసారి దీనికి భిన్నంగా కోల్ ఇండియా కన్నా ముందే సింగరేణి కార్మికులకు కొత్త వేజ్ బోర్డు జీతాలు అందించడం విశేషం. కొత్త జీతాల అమలు వల్ల సింగరేణి యాజమాన్యం ఏడాదికి సుమారు 1000 కోట్ల రూపాయల అదనపువ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కార్మికుల అభీష్టం మేరకు తక్షణమే కొత్త జీతాలు అమలు జరపాలని నిర్ణయించామని సిఎండి శ్రీధర్ ఆదేశం మేరకు జీతాల చెల్లింపుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేసామని డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ ఎన్ బలరాం ఆదివారం నాడొక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బొగ్గు గని ఉద్యోగుల వేతనాలను చర్చించి, నిర్ణయించే జెబిసిసిఐ 11వ సమావేశాలు ఈ మధ్యనే ముగిశాయి. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బొగ్గు పరిశ్రమలో పనిచేసే ఉద్యోగుల జాతీయ వేతన ఒప్పందం ద్వారా పెరిగిన బేసిక్ ఇతర అలవెన్సులను ఈనెల జీతాల నుండే ఉద్యోగులకు చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. తదనగుణంగా జాతీయ వేతన ఒప్పందం కింద జేబిసిసిఐ వద్ద అంగీకరించబడిన వివరాల ప్రకారం ఒక అండర్ గ్రౌండ్ ఉద్యోగి కనిష్ట స్థాయి , గరిష్ట స్థాయి డెసిగ్నేషన్‌ల యొక్క జీతాలు ఈ విధంగా ఉండనున్నాయి.

1. డైలీ రేటెడ్ కేటగిరి 1 యొక్క బేసిక్ ఇంతకుమునుపు జాతీయ వేతన ఒప్పందం ప్రకారం రోజుకు రూ.1011.27 ఉండగా ఇప్పుడు రోజుకు రూ.1502.66 అయింది.
2. అదేవిధంగా మంత్లీ రేటెడ్ ఏ1 గ్రేడ్ యొక్క బేసిక్ ఇంతకుముందు జాతీయ వేతన ఒప్పందం ప్రకారం నెలకు రూ. 98,485.79 పొందేవారికి ఇప్పుడు నెలకు రూ.1,46,341.67 అయింది.
3. మారిన కొత్త బేసిక్ ల ప్రకారం డైలీ రేటెడ్ కేటగిరి 1 ఉద్యోగి స్థూలంగా నెలకు రూ. 59,386.57 జీతంగా పొందనున్నారు.
4. అదేవిధంగా మంత్లీ రేటెడ్ అండర్ గ్రౌండ్ ఏ1 గ్రేడ్ లోని గరిష్ట బేసిక్ అయిన రూ. 1,46,341.67 ఉన్న ఉద్యోగులు స్థూలంగా నెలకు రూ. 2,16,618.74 జీతంగా పొందనున్నారు.
5 . సింగరేణి సంస్థ సిఎండి శ్రీధర్ ఆదేశాలను అనుసరించి జాతీయ వేతన ఒప్పందం ప్రకారం పెరిగిన వేతనాలను
ఎస్‌ఏపి పే రోల్ ద్వారా కార్యరూపం దాల్చేందుకు కృషిచేసిన ఫైనాన్స్, ఐటీ, ఈఆర్పి , హెచ్‌ఆర్ పేరోల్ అధికారులు, ఉద్యోగులను డైరెక్టర్ ఫైనాన్స్/ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ ఎన్ బలరాం ప్రత్యక్షంగా పర్యవేక్షించి అభినందనలు తెలియజేశారు. సింగరేణి ఉద్యోగులు యూనియన్లు ఈ పెరిగిన వేతనాలను సద్వినియోగం చేసుకుంటూ కంపెనీ ఉత్పత్తికి, ఉత్పాదకతలకు తోడ్పడాలని కోరారు. కోలిండియాలో ఇంకా వేజ్‌బోర్డు లో నిర్ణయించిన వేతనాల చెల్లింపు జరగక ముందు సింగరేణిలో జూన్ నెల వేతనాలతో పెరిగిన బేసిక్, అలవెన్సులను అమలు చేస్తుండడం విశేషం.

ఈ వేతన పెరుగుదల వలన సింగరేణి సంస్థపై నెలకు దాదాపుగా ఏడాదికి వెయ్యి కోట్ల పైచిలుకు భారం పడనుందని అయినప్పటికీ కూడా ఉద్యోగుల సంక్షేమం కోసం సింగరేణి సంస్థ ఇతర సంస్థలతో పోలిస్తే సర్వదా ముందంజలో ఉంటుందని ఛైర్మన్ ఎన్ శ్రీధర్.. ఆయన సారథ్యంలోని డైరెక్టర్లు అందరి సహాయ సహకారాలతో సింగరేణి సంస్థ తెలంగాణకే తలమానికంగా నిలుస్తోందని తెలుపుతూ ఈనెల జీతాలనుండే పెరిగిన వేతనాలను జూన్ 2023 నుండే ఉద్యోగులకు ఇచ్చేందుకు నిర్ణయించి అమలు చేస్తున్న చైర్మన్‌కు, అందరు డైరెక్టర్లకు జనరల్ మేనేజర్ పర్సనల్ ఐఆర్ అండ్ పిఎం బి హనుమంతరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

పెరిగిన జీతాల యొక్క అమలులో ఏవేని కొన్ని స్వల్ప తేడాలు గమనించినట్లయితే వాటిని రాబోయే నెల పే రోల్ ద్వారా సరి చేయగలమని తెలిపారు. పెరిగిన జీతాల గణన, చెల్లింపు అమలు లో సమన్వయం చేసి సహకరించిన డైరెక్టర్లు ఎన్. బలరాం, (డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పా), సత్యనారాయణ రావు (డైరెక్టర్ ఈ అండ్ ఎం), ఎన్‌వికే శ్రీనివాస్ (డైరెక్టర్ ఆపరేషన్స్), శ్రీ జి. వేంకటేశ్వర రెడ్డి (డైరెక్టర్ పి అండ్ పి) , ఎం. సురేష్ ( జిఎం కో-ఆర్డినేషన్), ఫైనాన్స్ జిఎంలు జి. వెంకటరమణ, ఎం. సుబ్బారావు, పర్సనల్ విభాగ అధికారులు బి హనుమంతరావు, జిఎం , ఏ. కుమార్ రెడ్డి (రిటైర్డ్ జిఎం , కవితా నాయుడులకు సంస్థ సిఎండి ఎన్ ఎన్ శ్రీధర్ అభినందనలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News