Monday, January 20, 2025

వనపర్తి నుంచి గద్వాల మీదుగా మంత్రాలయానికి కొత్త జాతీయ రహదారి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  వనపర్తి నుంచి గద్వాల మీదుగా మంత్రాలయానికి కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ ఏర్పాట్లు చేస్తోంది. కొత్త జిల్లా కేంద్రమైన వనపర్తికి నేరుగా ఏ జాతీయ రహదారి అనుసంధానం లేదు. అలాగే గద్వాల నుంచి ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయానికి సరైన రోడ్డు మార్గం లేదు. ఈ నేపథ్యంలోనే వనపర్తిని గద్వాలతో అనుసంధానిస్తూ అక్కడి నుంచి మంత్రాలయానికి నాగులదిన్నె మీదుగా జాతీయ రహదారి నిర్మించే ప్రతిపాదనలపై కేంద్రం ఓకే చేసింది. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల నుంచి ఎపిలోని మంత్రాలయానికి వెళ్లాలంటే కర్నూలు మీదుగా ప్రయాణిం చాల్సి ఉంటుంది. అదే కొత్త హైవే ఏర్పాటైతే గద్వాల నుంచి ఐజా మీదుగా వెళితే దాదాపు 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.
నాలుగు రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్
వచ్చే రెండేళ్లలో తెలంగాణలోని నాలుగు జాతీయ రహదారులను విస్తరించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మెదక్, ఎల్లారెడ్డిల మధ్య 43.9 కిలోమీటర్ల రోడ్డును రూ.399.01. కోట్లతో రెండు వరుసలుగా, పేవ్డ్ షోల్డర్స్, ఎల్లారెడ్డి-, రుద్రూరుల మధ్య 37.28 కిలోమీటర్ల మార్గాన్ని రూ.499,88 కోట్లతో రెండు వరుసల రోడ్డుగా విస్తరించనున్నారు. ఇక ఖమ్మం, కురవిల మధ్య 37,43 కిలోమీటర్ల రోడ్డును రూ. 455.78 కోట్లతో, ఆదిలాబాద్,- బేల మధ్య 32,97 కిలో మీటర్ల రోడ్డును రూ.490.92 కోట్లతో ఎన్‌హెచ్‌ఏఐ విస్తరించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News