Wednesday, January 22, 2025

గ్రేటర్‌లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

- Advertisement -
- Advertisement -

New Year Celebrations

మన తెలంగాణ/సిటీబ్యూరో: నూతన సంవత్సరం అనగానే పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంత్సరం ఓమిక్రాన్ కేసుల సంఖ్య ఓమిక్రాన్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నూతన సంవత్సరం వేడుకలపై కొంత గందరగోళంగా నెలకొన్నప్పటికి ప్రభుత్వం నిబంధనలతో కూడిన అనుమతులు ఇవ్వడంతో నగరంలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. గత సంవత్సరం సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొవిడ్ ప్రభావం అదపులో ఉండటంతో నూతన సంవత్సర వేడులకు జరుపుకునేందుకు యువత ఉత్సాహం చూపించారు.

గత కొద్ది రోజుల నుంచి గ్రేటర్‌లో చలి తీవ్రత అధికంగా ఉండటంతో యువత ముందుస్తుగానే రోడ్ల మీదకు వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా మరి కొంత మంది అర్ధ్దరాత్రి 12 గంటల వరకు సినిమా పాటల వింటూ ఉత్సాహంగా డ్యాన్స్‌లు వేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఫోన్లలో శుభాకాంక్షలు తెలుపుకోవడంతో నెట్ వర్క్ బిజిగా మారాయి. కొంత మంది వాట్సాప్‌ల ద్వారా తమ బంధువులు, స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకునేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు.
తగ్గిన ఎంట్రీ టికెట్‌ల ధరలు
సాధాణంగా ప్రతి సంవత్సరం పేరొందిన పబ్స్, క్లబ్‌ల నిర్వాహకులు న్యూ ఇయర్ ఈవెంట్లకు భారీ మొత్తంలో వసూల చేస్తుంటాయి. కాని ఈ సంవత్సరం ఒమిక్రాన్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులపై సందేహాలు నెలకొనడంతో నిర్వహణపై గందగోళం ఏర్పడింది. చివరకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో నిర్వహణకు హడావిడిగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాంగానే అతి తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆకర్షించేందుకు ఎంట్రీ పాస్‌ల ధరలను తగ్గించారు. గతంలో లో ప్రారంభ ఎంట్రీ పాస్ ధర రూ. 3 వేల నుంచి 5 వేలు ఉండగా దాన్ని ఒక్కరి సారిగా రూ ః 1000 నుంచి రూ. 3000లకు తగ్గించి వేయడంతో పెద్ద సంఖ్యలో యువత ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు అమల్లో నిర్వాహకులు విఫలం అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News