Saturday, November 23, 2024

న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో మొదలైన న్యూ ఇయర్ సంబరాలు

- Advertisement -
- Advertisement -

ఆక్లాండ్: ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ముందుగా కొన్ని దేశాల్లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. పసిఫిక్ దేశమైన కిరిబాటిఅందరికన్నా ముందుగా న్యూయియర్ వేడుకలు జరుపుకొంది. గ్రీనిచ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 10 గంటలకే కిరిబాటిలోని క్రిస్మస్ ఐలాండ్‌గా పిలవబడే దీవిలో కొత్త సంవత్సరం వేడుకలు మొదలయ్యాయి. కిరిబాటి తర్వాత న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో న్యూయర్ వేడుకలు ప్రారంభమయ్యాయి.

నగర ప్రజలు స్కై టవర్ వద్దకు చేరుకుని కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా స్వాగతం పలికారు.ఆనందోత్సాహాలు, బాణసంచా వెలుగుల మధ్య కివీస్ ప్రజలు2023 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2024 సంవత్సరానికి స్వాగతం చెప్పారు.ఈ సందర్భంగా పలు చోట్లు ఏర్పాటు చేసిన లేజర్ షోలు,ఫైర్‌వర్క్ షోలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్ద కొత్త సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షోలు జిగేల్‌మనిపిస్తున్నాయి. మరోవైపు కొత్త ఆశలు, లక్షాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి అనేక దేశాలు సిద్ధమవుతున్నాయి.

ఆస్ట్రేలియాలో మనకంటే అయిదున్నర గంటలు ముందుగా నూతన సంవత్సరం మొదలవుతుంది. సూర్యోదయ భూమిగా పేరొందిన జపాన్ కూడా మూడున్నర గంటలు ముందుగానే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాలు కూడా ఇదే సమయానికి కొత్త సంవతసరానికి స్వాగతం పలుకుతాయి.సవోమాలో కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభమైన ఎనిమిది గంటలకు మనం 2024లోకి అడుగుపెడతాం. ఇక మనతర్వాత సుమారు ననాలుగున్నర గంటలకు అత్యధికంగా 43 దేశాలు ఒకేసారి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ లాంటి ఐరోపా దేశాలతో పాటుగా కాంగో, అంగోలా, కామెరూన్‌లాంటి ఆఫ్రికా దేశాలున్నాయి. ఇక భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు అమెరికా 2024కు స్వాగతం పలకనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News