Monday, December 23, 2024

మందు చిందు విందు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సరం వేడుకలు జోరుగా సాగాయి. డీజే సౌండ్లు.. రంగురంగుల విద్యుత్ కాంతుల వెలుగుల్లో చిన్నా, పెద్దా.. యువత నృత్యాలు, కేరింతల నడుమ 2023 ఏడాదికి ఘన స్వాగతం పలికారు. కొత్త సంవత్సరాన్ని వేడుకగా జరుపుకున్నారు. సరిగ్గా రాత్రి 12 గంటలకు కేక్ కటింగ్‌లు, పరస్పర శుభాకాంక్షలు, దావత్‌లతో జోష్ నింపారు. మరోవైపు న్యూఇయర్ సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. శనివారం ఒక్క రోజే రూ.215.74 కోట్ల కొనుగోళ్లు జరిగాయి. గతేడాదితో పోల్చితే ఇది 7వేల కోట్లు అధికం. ఆరు రోజుల్లో రూ.1111.29 కోట్ల లిక్కర్ అమ్ముడుపోయింది. ఇక ఆన్‌లైన్‌లో ఫుడ్ కోసం జనం ఎగబడ్డారు. ముఖ్యంగా బిర్యానీ, పిజ్జా సేల్స్ రికార్డులు సృష్టించాయి. 3.50లక్షల బిర్యానీ ఆర్డర్లు, 2.5లక్షల పిజ్జా ఆర్డర్లు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని ఆర్‌టిసి క్రాస్ రోడ్స్‌లో ఉన్న ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్‌కు ప్రతి నిమిషానికి రెండు బిర్యానీ ఆర్డర్‌లు నమోదయ్యాయి. కొందరు మందుబాబులు ఫుల్‌గా తాగి కారు నడిపి తెల్లవారుజామున రాజధానిలో ఇద్దరి ప్రాణాలను బలిగొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News