Monday, December 23, 2024

కొత్త ఏడాది ఆంక్షలు.. ఫ్లైఓవర్లు మూసివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పలు ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. 31, డిసెంబర్ 2023 నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఓఆర్‌ఆర్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదు. పివిఎన్‌ఆర్ ఎక్స్ప్రెస్ వే రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. విమానాశ్రయం వెళ్లే వాహనాలకు మాత్రమే మినహాయింపు ఉంది.

ఫ్లైఓవర్లు మూసివేత…
డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11 నుంచి ఉదయం ఉదయం 5 గంటల వరకు కింది ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు (1 & 2), షేక్ పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెం.45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్- జెఎన్‌టియూ ఫ్లై ఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ (బాలానగర్).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News