Sunday, January 12, 2025

న్యూయార్క్ సబ్‌వే స్టేషన్‌లో కాల్పులు… ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : న్యూయార్క్ లోని సబ్‌వే స్టేషన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో 34 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి సీరియస్‌గా ఉందని పోలీస్‌లు చెప్పారు. గాయపడిన వారిలో 14 ఏళ్ల బాలిక, 15 ఏళ్ల బాలుడు, మరో 28,29,71 ఏళ్ల ముగ్గురు పెద్దలు ఉన్నారు. బాధితుల్లో కొందరు ఈ వివాదంతో సంబంధం ఉన్నవారు కాగా, మిగతా వారు రైలు కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు.

సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో బ్రోంక్స్ లోని ఎలివేటెడ్ రైలు ప్లాట్‌ఫారమ్‌పై కాల్పులు జరిగాయి. రెండు గ్రూపుల యువకుల మధ్య వివాదమే కాల్పులకు దారి తీసినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో నగరం అంతటా స్టేషన్‌లు పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న పిల్లలతో , చాలా మంది కార్మికులతో రద్దీగా ఉంది. రైలు ప్లాట్‌ఫారం పైకి రాగానే ఘర్షణ తలెత్తింది. రెండు గ్రూపులు ఘర్షణకు పాల్పడ్డారని ఎన్‌వైపిడి చీఫ్ ఆఫ్ ట్రాన్సిట్ మైకేల్ కెంపెర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News