Wednesday, January 22, 2025

న్యూయార్క్‌లో వరదలు..

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : అమెరికాలోని మహానగరం న్యూయార్క్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో జలదిగ్బంధం అయింది. దీనితో న్యూయార్క్ సిటీ, సమీపంలోని హడ్సన్ వ్యాలీ, లాంగ్ ఐలాండ్‌లలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శుక్రవారం పలు ప్రాంతాల్లో వాహనదారులు ఆకస్మిక వరదలతో ఇబ్బందుల పాలయ్యారు. ఈ ప్రాంతంలో ఇప్పటి భారీ , విపత్కర వర్షాలతో జాగ్రత్త చర్యలను మరింతగా కేంద్రీకృతం చేసుకునేందుకు ఎమర్జెన్సీ పరిస్థితిని విధించారు. ఇప్పటి పరిస్థితి శనివారం , ఆదివారం వరకూ ఉంటుందని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్ అధికారిక ప్రకటనలో తెలిపారు. కాగా వర్షాల ప్రభావంతో పలు సబ్‌వే రైలు లైన్లను నిలిపివేశారు. పట్టాలపై వరద నీరు వచ్చిచేరిందని దీనితో రైళ్ల నిలిపివేత తప్పలేదని ఎంటిఎ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News