Monday, November 18, 2024

కివీస్ 162 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభమైన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపటిన ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఓపెనర్లు స్టీవ్ స్మిత్, ఖ్వాజా జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. స్మిత్ (11), ఖ్వాజా (16) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. అయితే మార్నస్ లబుషేన్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. సమన్వయంతో ఆడుతున్న లబుషేన్ 8 ఫోర్లతో 45 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.

కామెరూన్ గ్రీన్ (25), ట్రావిస్ హెడ్ (21) అతనికి అండగా నిలిచారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో మ్యాచ్ హెన్రీ మూడు వికెట్లను పడగొట్టాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్ టామ్ లాథమ్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వారిలో మ్యాట్ హెన్రీ (29), టిమ్ సౌథి (26), వికెట్ కీపర్ బ్లుండెల్ (22) మాత్రమే కాస్త రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్ ఐడు, స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టారు. కాగా, తొలి మ్యాచ్‌లో గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్‌లో 10 ఆధిక్యంలో నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News