- Advertisement -
ఆస్ట్రేలియా: దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. న్యూ కలోడినియా ప్రాంతంలో పది కిలో మీటర్లలో భూకంప నాభి ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆఫ్ఘానిస్థాన్ లోని హిందూకుష్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైందని అధికారులు వెల్లడించారు.
- Advertisement -