Sunday, December 29, 2024

తొలి టి20లో కివీస్ గెలుపు

- Advertisement -
- Advertisement -

సొంత గడ్డపై శ్రీలంకతో జరిగిన తొలి టి20లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో గెలుపొంది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమతమైంది. లక్ష చేధనకు దిగిన లంక బ్యాటర్లలో పాథుమ్ నిస్సంక(90), కుశాల్ మెండిస్(46) తొలి వికెట్‌కు 121 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో శ్రీలంకదే విజయమని అందరూ భావించారు. కానీ కివీస్ పేసర్ జాకబ్ ఢఫీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 14వ ఓవర్ వేసిన ఢఫీ, కుశాల్ మెండీస్(46), కుశాల్ పెరీరా(0),

కమిందు మెండిస్(0)లను ఒకే ఓవర్‌లో ఔట్ చేసి మ్యాచ్‌ను న్యూజిలాండ్ వైపు తిప్పాడు. ఇక, చివరి ఓవర్‌లో లంక విజయానికి 14 పరుగులు అవసరం కాగా కేవలం 5 పరుగులు మాత్రమే సాధించారు. దీంతో 8 పరుగుల తేడాతో లంక పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. 60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 90 పరుగులు చేసిన పాథుమ్ నిస్సంక శ్రమ వృథాగా మారింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాటర్లలో డారీల్ మిచెల్(62), బ్రాస్‌వెల్(58) అర్ధ శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది న్యూజిలాండ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News