Wednesday, January 8, 2025

సిరీస్ సమం చేసిన కివీస్

- Advertisement -
- Advertisement -

చివరి టి20లో 17 పరుగులతో గెలుపు

మౌంట్ మాంగనూయ్ : సొంత గడ్డపై బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది న్యూజిలాండ్. తొలి టి20లో బంగ్లా సంచలన విజయం సాధించగా అనంరతం జరిగిన రెండో టి20 వర్షం కారణంగా ఫలితం తేలలేదు. ఇక మూడో టి20లో చెలరేగిన కివీస్ ఆటగాళ్లు జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో సిరీస్‌ను సమం చేయగలిగింది. ఆదివారం జరిగిన ఆఖరీ టి20లో కివీస్ 17 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా కెప్టెన్ శాంటో (17) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ ఆది నుంచే వికెట్లు కోల్పోయింది.

బ్యాటర్లను కుదురుకోనివ్వకుండా కివీస్ క్రమం తప్పకుండా వికెట్లు తీసింది. కెప్టెన్ శాంట్నర్ బంతిని గింగరాలు తిప్పుతూ నాలుగు వికెట్లు సాధించాడు. నాలుగు ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చాడు. సౌథి, మిల్నే, సీర్స్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష ఛేదనకు దిగిన కివీస్‌కు బంగ్లా చుక్కలు చూపించింది. 49 పరుగులకే సగం వికెట్లు పడగొట్టి ఆతిధ్య జట్టుకు వణుకు పుట్టించింది. బంగ్లా బౌలర్ల ధాటికి సీఫెర్ట్ (1), డారిల్ మిచెల్ (1), గ్లెన్ ఫిలిప్స్ (1), చాప్‌మన్ (1) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

అయితే ఓపెనర్ ఫిన్ అలెన్ (38) దూకుడుగా ఆడటంతో కివీస్ బయటపడింది. అలెన్ ఔటైన తర్వాత నీషమ్ (28 నాటౌట్), శాంట్నర్ (18 నాటౌట్) ఆచీతూచీ ఆడుతూ మరో వికెట్ పడకుండా స్కోరు బోర్డును ముందుకు నడిపారు. ఈ క్రమంలో 14.4 ఓవర్లకు న్యూజిలాండ్ 95/5తో ఉన్నప్పుడు వర్షం రాకతో ఆటను నిలిపివేశారు. ఆ సమయానికి కివీస్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 17 పరుగుల ముందజలో ఉంది. తర్వాత మ్యాచ్‌ను కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు కివీస్ గెలిచినట్లు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News