Friday, April 4, 2025

కివీస్‌కు వన్డే సిరీస్

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కివీస్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 20తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మిఛెల్ హే అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన హే 78 బంతుల్లోనే ఏడు సిక్సర్లు, మరో 7 ఫోర్లతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సెంచరీకి ఒక పరుగు దూరంలో నిలిచిపోయాడు. మహ్మద్ అబ్బాస్ (41), నికల్ కెల్లి (31) తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేక పోయారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 41.2 ఓవర్లలో కేవలం 208 పరుగులకే కుప్పకూలింది. వసీం జూనియర్(73), నసీమ్ షా (51)లు మాత్రమే రాణించారు. కివీస్ బౌలర్లలో బెన్ సీర్స్ ఐదు, జాకబ్ డఫ్లీ మూడు వికెట్లు పడగొట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News